సుందర్ సి పేరుతో ట్విట్టర్ అకౌంట్.. షాకింగ్ నిజం బయటపెట్టిన ఖుష్బూ!

by Mallepaka Hamsa |   (  Updated:2026-03-30 08:41:07  IST  )

దర్శకుడు సుందర్ సి గారి పేరుతో ఉన్న ఆ ట్విట్టర్ ఖాతా పూర్తిగా ఫేక్. ప్రస్తుతానికి ఆయన ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేరు.

సుందర్ సి పేరుతో ట్విట్టర్ అకౌంట్.. షాకింగ్ నిజం బయటపెట్టిన ఖుష్బూ!
X

దిశ, సినిమా: దక్షిణాది చిత్ర పరిశ్రమలో సీనియర్ నటిగా, రాజకీయ నాయకురాలిగా తనదైన ముద్ర వేసిన ఖుష్బూ సుందర్, తాజాగా తన భర్త, ప్రముఖ దర్శకుడు సుందర్ సి గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చారు. గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో సుందర్ సి పేరుతో ఒక ట్విట్టర్ ఖాతా తెరిచినట్లు, ఆయన త్వరలోనే రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. అయితే, ఈ వార్తలన్నీ కేవలం పుకార్లేనని ఖుష్బూ స్పష్టం చేశారు.సెలబ్రిటీల పేరుతో నకిలీ ఖాతాలు సృష్టించి తప్పుడు ప్రచారం చేయడం ఈ మధ్య కాలంలో సర్వసాధారణమైపోయింది. సుందర్ సి విషయంలో కూడా అదే జరిగిందని ఖుష్బూ గుర్తించి అభిమానులను అలర్ట్ చేశారు. తన భర్త పేరుతో వైరల్ అవుతున్న ఆ అకౌంట్ నకిలీ అని ఆమె తేల్చి చెప్పారు. "దర్శకుడు సుందర్ సి గారి పేరుతో ఉన్న ఆ ట్విట్టర్ ఖాతా పూర్తిగా ఫేక్. ప్రస్తుతానికి ఆయన ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లోనూ అందుబాటులో లేరు. దయచేసి అటువంటి నకిలీ ఖాతాలను ఎవరూ ఫాలో అవ్వకండి.

అలాగే ఆ ఖాతాల నుండి వచ్చే సందేశాలకు స్పందించవద్దు" అని ఆమె సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా, తన భర్త కోసం త్వరలోనే ఒక అధికారిక సోషల్ మీడియా ఖాతాను రూపొందించనున్నట్లు ఆమె వెల్లడించారు. అప్పటి వరకు ఆయన పేరుతో వచ్చే ఏ వార్తలను నమ్మవద్దని కోరారు. సుందర్ సి ప్రస్తుతం తన తదుపరి చిత్రాల షూటింగ్ ,ఇతర పనుల్లో బిజీగా ఉన్నారని, ఆయన రాజకీయ ఎంట్రీ గురించి వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఈ ప్రకటనతో స్పష్టమైంది. ఖుష్బూ ఇచ్చిన ఈ వివరణతో సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారానికి ఒక్కసారిగా చెక్ పడినట్లయింది. అభిమానులు కూడా అధికారిక ఖాతా వచ్చే వరకు వేచి చూడాలని ఆమె సూచించారు.

నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్‌తో సినిమా చేయడంపై షాకింగ్ ట్విస్ట్ ఇచ్చిన సల్మాన్.. సంచలనంగా మారిన పోస్ట్

Next Story