- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Grammy Awards 2026 : నగ్నంగా గామీ స్టేజీపైకి టాప్ సింగర్.. హాట్ టాపిక్‌గా మారిన ఫొటోలు
సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 68వ గ్రామీ అవార్డ్స్(Grammy Awards) (2026) వేడుకలు లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగాయి.

దిశ, సినిమా: సంగీత ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన 68వ గ్రామీ అవార్డ్స్(Grammy Awards) (2026) వేడుకలు లాస్ ఏంజిల్స్‌లో అట్టహాసంగా జరిగాయి. అయితే, అవార్డుల కంటే కూడా అమెరికన్ పాప్ సెన్సేషన్ చాపెల్ రోన్ (Chappell Roan) ధరించిన దుస్తులు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె రెడ్ కార్పెట్‌పై దాదాపు నగ్నంగా కనిపిస్తూ, కేవలం బాడీ ఆర్ట్.. షీర్ గౌనుతో దర్శనమిచ్చి అందరినీ షాక్‌కు గురిచేసింది. 1998నాటి మగ్లర్ వింటేజ్ కలెక్షన్‌ను తలపించేలా ఉన్న ఈ డ్రెస్, ఈ ఏడాది గ్రామీలోనే అత్యంత సాహసోపేతమైన ఫ్యాషన్ గౌన్‌గా నిలిచింది. ఇక ఈ డ్రెస్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇది ఎటువంటి బాడీస్ లేకుండా కేవలం నిపుల్ రింగ్స్ సహాయంతో శరీరంపై వేలాడుతున్నట్లుగా డిజైన్ చేయబడింది.
చాపెల్ రోన్ తన శరీరానికి రంగురంగుల బాడీ ఆర్ట్‌ను జత చేసి తన పాట ‘పింక్ పోనీ క్లబ్’ను గుర్తుకు తెచ్చేలా వెనుక భాగంలో ఒక పెద్ద గుర్రం టాటూను (Temporary Tattoo) చూపించింది. రెడ్ కార్పెట్‌పై ఆమె నడుస్తుంటే, చాపెల్ ధైర్యమే అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇంటర్వ్యూల సమయంలో మాత్రం ఆమె ఒక మెరూన్ కలర్ టాప్‌తో బాడీని కవర్ చేసుకున్నప్పటికీ, ఫొటో షూట్ సమయంలో మాత్రం తన బోల్డ్ లుక్‌తో కెమెరాలకు ఫోజులిచ్చింది. ఈ వినూత్న ఫ్యాషన్‌పై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు ఆమెను ఫ్యాషన్ ఐకాన్ అని పొగుడుతుంటే, మరికొందరు ఇది మరీ అతిగా ఉందంటూ విమర్శిస్తున్నారు.
అయితే దీనిపై చాపెల్ రోన్ స్పందిస్తూ.. ‘‘ఇది అద్భుతమైన.. వింతైన ప్రయత్నం, నాకు ఇది చాలా నచ్చింది. మీ స్వేచ్ఛా సంకల్పాన్ని ఉపయోగించమని నేను సలహా ఇస్తున్నాను. అలాగే నాకు ఓటు వేసిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను" అని చెప్పి ట్రోల్స్‌కు గురవుతోంది.. ఈ వేడుకలో ఆమె 'రికార్డ్ ఆఫ్ ది ఇయర్', 'బెస్ట్ పాప్ సోలో పెర్ఫార్మెన్స్' విభాగాల్లో నామినేట్ అయినట్లు తెలుస్తోంది. కేవలం తన పాటలతోనే కాకుండా, తన ఫ్యాషన్ సెన్స్‌తో కూడా ఆమె ఈ ఏడాది గ్రామీ వేడుకల్లో ఒక సెన్సేషన్ గా నిలిచిపోయింది. ఏది ఏమైనా, గ్రామీ అవార్డ్స్ వంటి అంతర్జాతీయ వేదికపై అందరి కళ్లూ తన వైపు తిప్పుకోవడంలో చాపెల్ రోన్ సక్సెస్ అయ్యింది. అవార్డుల గెలుపోటములతో సంబంధం లేకుండా, ఈ ఏడాది గ్రామీలో అత్యంత చర్చనీయాంశమైన వ్యక్తిగా ఆమె నిలిచింది. ప్రస్తుతం చాపెల్‌కు సంబంధించిన ఫొటోలు నెట్టింట చర్చనీయాంశంగా మారాయి.






