- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
12 ఏళ్ల పోరాటం వదిలిపెట్టే ప్రసక్తి లేదు.. ఒక్క పోస్ట్‌తో అందరి నోళ్లు మూయించిన పాయల్
‘RX -100’ చిత్రంతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో సెన్సేషన్ సృష్టించిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)మొదటి ప్రాజెక్ట్‌తోనే ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది.

దిశ, సినిమా: ‘RX -100’ చిత్రంతో తెలుగు కుర్రాళ్ల గుండెల్లో సెన్సేషన్ సృష్టించిన పాయల్ రాజ్‌పుత్ (Payal Rajput)మొదటి ప్రాజెక్ట్‌తోనే ఫుల్ ఫేమ్ రాబట్టుకుంది. తన అందం, అభినయం, నటనతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. ఆ తర్వాత జిన్నా, వెంకీ మామ, రక్షణ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఒక్క హిట్ కూడా పడలేదు. అయినప్పటికీ నిరాశ చెందకుండా పాయల్ వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకుంది. ఈ సమయంలో వచ్చిన మంగళవారం, తీస్ మార్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్స్‌గా నిలవడంతో పాయల్ మళ్లీ ఫామ్‌లోకి వచ్చేసింది. ఇప్పుడు మరో ప్రయోగాత్మక చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
పాయల్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘వెంకటలచ్చిమి’ (Venkatalachimmi). ఒక ఆదివాసీ మహిళ తన జీవితంలో ఎదురైన అన్యాయంపై ఎలా ప్రతీకారం తీర్చుకుందనే ఇంటెన్స్ డ్రామాతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ముని దర్శకత్వంలో వస్తున్న ఈ పవర్‌ఫుల్ థ్రిల్లర్‌ను ఆరు భాషల్లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. ‘మంగళవారం’ వంటి హిట్ తర్వాత పాయల్ నుంచి వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ టాలీవుడ్‌లో కలకలం రేపుతోంది. తన కెరీర్ ముగిసిపోయిందని, నటన మానేయాలని విమర్శిస్తున్న వారికి ఆమె అత్యంత ఘాటుగా సమాధానమిచ్చింది. ‘‘నన్ను మానేయమని కొందరు కోరుకుంటున్నారు.
నేను కూడా ఒక నిమిషం ఆలోచించాను. కానీ గత 12 ఏళ్లుగా నేను పడిన కష్టం గుర్తొచ్చింది. నేను విఫలం కావచ్చు, కానీ రంగాన్ని వదిలిపెట్టే ప్రసక్తి లేదు’’ అంటూ పాయల్ రాసుకొచ్చింది. అయితే తనను కించపరిచేలా మాట్లాడుతున్న వారి పేర్లను బయటపెట్టనప్పటికీ, తన పోరాటం కొనసాగుతుందని ఆమె స్పష్టం చేసింది. అలాగే తనను తక్కువ చేసి మాట్లాడుతున్న వారి నోళ్లు మూయించింది. ఇండస్ట్రీలో 12 ఏళ్లుగా కొనసాగుతూ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్న పాయల్, ఇప్పుడు తన సెకండ్ ఇన్నింగ్స్‌ను చాలా సీరియస్‌గా తీసుకుంది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, ‘వెంకటలచ్చిమి’ వంటి కథా బలం ఉన్న చిత్రాలను ఎంచుకుంటోంది. ప్రస్తుతం పాయల్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా అది చూసిన నెటిజన్లు "వదిలిపెట్టకు పాయల్.. నీ టాలెంట్ ఏంటో నీ సినిమాలే చెబుతాయి" అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.






