వాలెంటైన్స్ డే నాడు గ్లోబల్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-08 11:56:29  IST  )

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబినేషన్‌లో రాబోతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’(peddi).

వాలెంటైన్స్ డే నాడు గ్లోబల్ స్టార్ సర్‌ప్రైజ్.. ‘పెద్ది’ నుంచి అదిరిపోయే అప్‌డేట్!
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan), డైరెక్టర్ బుచ్చిబాబు సనా(Buchi Babu Sana) కాంబినేషన్‌లో రాబోతున్న పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’(peddi). ఈ భారీ బడ్జెట్ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా.. కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన ‘చికిరి చికిరి’ సాంగ్ సోషల్ మీడియాలో ప్రభంజనం సృష్టించింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో అత్యధిక వ్యూస్ సాధించి రికార్డులను తిరగరాసిన ఈ పాట, సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. తాజాగా ఈ సినిమా నుంచి రెండో పాట విడుదలకు చిత్ర యూనిట్ ముహూర్తం ఖరారు చేసినట్లు తెలుస్తోంది. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నట్లు సమాచారం.

అయితే, ఇది రామ్ చరణ్ క్యారెక్టర్‌ను పవర్‌ఫుల్‌గా పరిచయం చేస్తూ సాగే ‘ఇంట్రడక్షన్ సాంగ్’ అని ఫిల్మ్ నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ గీతం మెగా అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంటుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా విడుదల తేదీ విషయంలో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. మొదట ఈ చిత్రాన్ని మార్చి 27న విడుదల చేయాలని ప్లాన్ చేశారు. అయితే, సరిగ్గా దానికంటే ఒక రోజు ముందు అంటే మార్చి 26న పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. బాబాయ్ సినిమాతో బాక్సాఫీస్ వద్ద పోటీ పడటం ఇష్టం లేని రామ్ చరణ్, తన సినిమాను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. బాబాయ్ కోసం అబ్బాయి రిలీజ్ డేట్‌ను త్యాగం చేసి, ఏప్రిల్ 30కి మార్చుకుని అందరి ప్రశంసలు పొందుతున్నాడు.

వారసులొచ్చిన వేళ.. మెగా ఇంట వెలుగులు నింపిన నందమూరి బాలయ్య కానుకలు.. ఏం పంపారంటే!

యుద్ధానికి సిద్ధమైన ప్రభాస్.. ‘ఫౌజీ’ షూటింగ్ అప్డేట్‌తో సోషల్ మీడియా షేక్!

Next Story