- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారసులొచ్చిన వేళ.. మెగా ఇంట వెలుగులు నింపిన నందమూరి బాలయ్య కానుకలు.. ఏం పంపారంటే!
నందమూరి, మెగా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంటుంది.

దిశ, సినిమా: నందమూరి, మెగా కుటుంబాల మధ్య ఉన్న అనుబంధం మరోసారి అందరినీ ఆకట్టుకుంటుంది. రామ్ చరణ్(Ram Charan)సతీమణి ఉపాసన(Upasana) ఇటీవల కవల పిల్లలు పాప, బాబుకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. క్లిన్ కార తర్వాత తమ కుటుంబంలోకి ఇద్దరు నూతన అతిథులు రావడంతో మెగా ఇంట సంబరాలు అంబరాన్నంటాయి. తాజాగా, మెగా వారసులకు నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రత్యేకమైన బహుమతులు పంపినట్లు సమాచారం. చరణ్ దంపతులకు మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతూ, అత్యంత ఆత్మీయమైన కానుకలను పంపించి మెగా ఫ్యాన్స్‌ను సైతం ఖుషీ చేశారు. బాలయ్య పంపిన ఈ కానుకల్లో భక్తి, ఆశీస్సులు కలగలిసి ఉన్నాయి. నూతనంగా జన్మించిన కవలల కోసం శ్రీ వేంకటేశ్వర స్వామి విగ్రహం, తిరుమల ప్రసాదం, పూలతో పాటు పసిపిల్లల కోసం ప్రత్యేకమైన బొమ్మలను బాలకృష్ణ పంపించారట. సాధారణంగా సినీ ఇండస్ట్రీలో కుటుంబాల మధ్య పోటీ ఉంటుందని చర్చించుకుంటూ ఉంటారు.
కానీ బాలయ్య చేసిన పనితో అదంతా కేవలం సినిమాల వరకేనని స్పష్టం అయింది. ఈ అపురూపమైన కానుకలను చూసినమెగా ఫ్యామిలీ సంతోషంగా ఫీలయ్యారట. ఇక ఈ విషయం తెలుసుకున్న మెగా అభిమానులు, నెటిజన్లు బాలయ్యపై ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఒకవైపు వ్యక్తిగత జీవితంలో తండ్రిగా ప్రమోషన్ పొందిన రామ్ చరణ్, మరోవైపు వృత్తిపరంగా కూడా ఫుల్ బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. గ్లోబల్ స్టార్ ప్రస్తుతం బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న భారీ బడ్జెట్ మూవీ ‘పెద్ది’ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండగా, బాబాయ్ పవన్ కళ్యాణ్ సినిమా కోసం తన విడుదల తేదీని మార్చుకుని, ఏప్రిల్ 30న ప్రేక్షకుల ముందుకు రావడానికి చరణ్ సిద్ధమవుతున్నారు.






