యుద్ధానికి సిద్ధమైన ప్రభాస్.. ‘ఫౌజీ’ షూటింగ్ అప్డేట్‌తో సోషల్ మీడియా షేక్!

by Mallepaka Hamsa |   (  Updated:2026-02-08 05:42:44  IST  )

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’(Fauji).

యుద్ధానికి సిద్ధమైన ప్రభాస్.. ‘ఫౌజీ’ షూటింగ్ అప్డేట్‌తో సోషల్ మీడియా షేక్!
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) హీరోగా, టాలెంటెడ్ డైరెక్టర్ హను రాఘవపూడి (Hanu Raghavapudi)దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ బడ్జెట్ చిత్రం ‘ఫౌజీ’(Fauji). మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమాపై అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే, ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పటివరకు మేకర్స్ అధికారికంగా ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వనప్పటికీ.. ప్రేక్షకుల్లో అంచనాలు పీక్స్ ఉన్నాయి. అప్డేట్స్ ఎప్పుడెప్పుడు వస్తాయా? అని అంతా ఎదురుచూస్తున్నారు. ఈక్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఒక ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. తాజా సమాచారం ప్రకారం, ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు చివరి దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది. చిత్రానికి సంబంధించిన కీలకమైన టాకీ పార్ట్ పూర్తయిందని, కేవలం హై-వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్‌లు మాత్రమే మిగిలి ఉన్నాయని సమాచారం.

ఈ యాక్షన్ ఎపిసోడ్స్‌ను అత్యంత భారీ స్థాయిలో చిత్రీకరించేందుకు దర్శకుడు హను రాఘవపూడి ప్లాన్ చేశారట. దాదాపు 100 రోజుల పాటు ఈ యాక్షన్ షెడ్యూల్ కొనసాగనున్నట్లు ఫిలిం నగర్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మరోవైపు, ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై కూడా ఒక క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. షూటింగ్ వేగంగా పూర్తి చేసి, ఈ ఏడాది దసరా కానుకగా ‘ఫౌజీ’ని థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్టులు సోషల్ మీడియాను షేక్ చేయడంతో పాటు ప్రభాస్ అభిమానుల ఆనందానికి కారణం అవుతున్నాయి. రెండవ ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ మునుపెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. ఇందులో డార్లింగ్‌కు జోడీగా ఇమాన్వి హీరోయిన్‌గా నటిస్తోంది. అదే నిజమైతే, ఈ దసరాకు బాక్సాఫీస్ వద్ద ప్రభాస్ మరోసారి తన సత్తా చాటడం ఖాయంగా కనిపిస్తోంది.

అనిల్ రావిపూడి-వెంకటేష్ కొత్త సినిమా.. కథ తెలిస్తే షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే

Next Story