అనిల్ రావిపూడి-వెంకటేష్ కొత్త సినిమా.. కథ తెలిస్తే షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే

by Gugulothu.Kavitha |   (  Updated:2026-02-08 05:37:34  IST  )

హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

అనిల్ రావిపూడి-వెంకటేష్ కొత్త సినిమా.. కథ తెలిస్తే షాక్ అయ్యి షేక్ అవ్వాల్సిందే
X

దిశ, వెబ్‌డెస్క్: హిట్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(Anil Ravipudi) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్లే తన బలం అని నమ్మి, వరుస హిట్లు అందుకుంటున్న ఈ యంగ్ డైరెక్టర్.. సంక్రాంతి సీజన్‌ను అస్సలు వదులుకోడు. ఇందులో భాగంగా ఈ ఇయర్ సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాతో ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. చిరంజీవి, నయనతార హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో వెంకటేష్ కామియో రోల్ ప్లే చేశాడు.

ఇక ప్రజెంట్ అనిల్ తన నెక్స్ట్ సినిమా విక్టరీ వెంకటేష్‌(Venkatesh)తో చేయబోతున్నాడు. అయితే వీరిద్దరి కాంబోలో ఇది 5వ సినిమా కావడం విశేషం. F2′ ‘F3’ ‘సంక్రాంతికి వస్తున్నాం’ ‘మన శంకర వరప్రసాద్ గారు'(క్యామియో).. ఇలా వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలన్నీ సూపర్ హిట్లే. అయితే వెంకీ-అనిల్ కాంబోలో వస్తున్న ఈ మూవీలో పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్(Fahad Fasil) కూడా నటిస్తున్నాడు. సాహు గారపాటి, సురేశ్‌ ప్రొడక్షన్స్‌ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం రానున్న సంక్రాంతికి వినోదాల విందు చేయడం ఖాయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

ఈక్రమంలో ఈ సినిమా స్టోరీకు సంబంధించినవా న్యూస్ నెట్టింట వైరల్‌ అవుతోంది. వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం.. ఈ సినిమా బావ – బావమరిదిల కథ అట. వదినా మరదళ్ళ మధ్య వారిద్దరూ ఎలా నలిగిపోయారు? ఈ క్రమంలో వారిద్దరి ఫ్రెస్ట్రేషన్‌ ఏంటి? అనే ప్రశ్నల చుట్టూ అల్లుకున్న కామెడీ కథ అట ఇది. అలాగని ఇదేం ‘ఎఫ్‌ 2’ ఫ్రాంచైజీలో భాగం కానే కాదు. ఇదొక కొత్త కథ. ఇందులో బావ – బావమరిదులుగా వెంకటేశ్‌, ఫహాద్‌ ఫాజిల్‌ కనిపించనున్నారు. ఇక వదిన, మరదళ్లు ఎవరో తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్‌గా మారింది.

ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం పక్కా.. శివాజీపై అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్

Next Story