- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రేక్షకులు ఎంజాయ్ చేయడం పక్కా.. శివాజీపై అనిల్ రావిపూడి కామెంట్స్ వైరల్
సీనియర్ నటుడు శివాజీ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై తీసుకురాబోతున్న రెండవ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.

దిశ, సినిమా: సీనియర్ నటుడు శివాజీ నిర్మాతగా మారి తన సొంత బ్యానర్ శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ పతాకంపై తీసుకురాబోతున్న రెండవ చిత్రం ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఇందులో శివాజీ, సీనియర్ హీరోయిన్ లయ జంటగా నటించారు. రోహన్, ప్రిన్స్, అలీ, ధన్‌రాజ్, ఇమ్మాన్యూయేల్ ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫిబ్రవరి 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో తాజాగా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ టీం అందరికీ కంగ్రాట్స్. ఈ సినిమా ట్రైలర్ చూశా. సూపర్‌గా ఉంది. చాలా నవ్వుకున్నా. డైరెక్టర్ సుధీర్ రైటింగ్, ప్రెజెంటేషన్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటేనే సినిమా చూడాలని క్యూరియాసిటీ పెరిగింది. శివాజీ ప్రేమకు ధన్యవాదాలు. ఈ సినిమాలో లయ క్యారెక్టర్ సూపర్‌గా ఉంది. అందరికీ బెస్ట్ విషెస్ చెబుతున్నా. ఫిబ్రవరి 12కి ఈటీవీ విన్‌లో రాబోతున్న ఈ సినిమా చూసి ప్రేక్షకులందరూ ఎంజాయ్ చేయడం పక్కా’ అని అన్నారు.






