హాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న స్టార్ కిడ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-07 04:33:14  IST  )

గత కొద్ది రోజులనుంచి సినీ సెలబ్రిటీలు వారసులను ఇండస్ట్రీకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.

హాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వబోతున్న  స్టార్ కిడ్.. ఎమోషనల్ పోస్ట్ వైరల్
X

దిశ, సినిమా: గత కొద్ది రోజులనుంచి సినీ సెలబ్రిటీలు వారసులను ఇండస్ట్రీకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఎంతోమంది తమకంటూ మంచి ఫేమ్ రాబట్టుకున్న తర్వాత తమ వారసులను పరిచయం చేస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు స్టార్ హీరోలు తమ వారసులను జాగ్రత్తగా ప్లాన్ చేసి ఇండస్ట్రీకి తీసుకొస్తున్నారు. కథ, దర్శకుడు, బ్యానర్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, సరైన లాంచ్ ఉండేలా చూస్తున్నారు. అలాగే మార్కెటింగ్, ప్రమోషన్స్ విషయంలోనూ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీంతో కొత్త తరం నటుల ఎంట్రీకి ముందే భారీ అంచనాలు నెలకొంటున్నాయి. తాజాగా, ఓ స్టార్ కిడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఓ హాలీవుడ్ సినిమాతో అలరించబోతుండగా.. అప్పుడే సెట్లోకి కూడా అడుగుపెట్టింది.

ఈ విషయాన్ని తెలుపుతూ.. హీరోయిన్ అన్షు (Anshu)ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. అందం, అమాయకత్వంతో అందరి మనుసులు గెలుచుకున్న అన్షు ‘మన్మధుడు’ సినిమాతో ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇందులో సంప్రదాయ లుక్‌లో కనిపించిన అన్షు.. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తర్వాత పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన ‘రాఘవేంద్ర’లో నటించింది. అలాగే ‘మిస్సమ్మ’లో గెస్ట్ రోల్ చేసినప్పటికీ పెద్దగా అవకాశాలు రాకపోవడంతో తమిళ ఇండస్ట్రీకి చెక్కేసింది. ఈక్రమంలోనే పెళ్లి చేసుకున్న అన్షు పర్సనల్ లైఫ్ వల్ల సినిమాలకు దూరం అయింది. చాలా ఏళ్ల తర్వాత మళ్లీ గత ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన ‘మజాకా’ మూవీతో ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా బాక్సాఫీసు వద్ద నిరాశపరిచింది.

ఇక అప్పటినుంచి అన్షు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తన పోస్టులతో వార్తల్లో నిలుస్తోంది. ఈక్రమంలోనే.. తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయనున్నట్లు ఇన్‌స్టా ద్వారా వెల్లడించింది. అంతేకాకుండా తొలిసారి షనయా(Shanaya) సెట్లోకి అడుగుపెట్టిన ఫొటోలు షేర్ చేస్తూ.. ‘‘నా కూతురు మొదటిసారి సెట్లోకి అడుగుపెట్టింది. నా హృదయం సంతోషంతో నిండిపోయింది. నాపై చూపించిన ప్రేమ, అభిమానం షనయాపై కూడా చూపించండి’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ పోస్ట్ చూసిన వారంతా కంగ్రాట్స్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే షనయా నటిస్తున్న సినిమాను హాలీవుడ్ లేడీ డైరెక్టర్ అలీనా ఇలిన్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.

Read More..

సిగరెట్ కాల్చితూ, మందు కొడుతూ బాలీవుడ్ హీరోయిన్ల రచ్చ !

Similar News : బిగ్ షాకిచ్చిన శ్రద్ధా కపూర్.. నేను పెళ్లి చేసుకుంటానంటూ పోస్ట్

Next Story