వెన్నులో వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్.. భయంకరంగా ఫస్ట్ లుక్ పోస్టర్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-02 04:37:46  IST  )

హారర్ సినిమాల ప్రేమికులకు గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన ‘డీమాంటి కాలనీ’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

వెన్నులో వణుకుపుట్టించే హారర్ థ్రిల్లర్.. భయంకరంగా ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా: హారర్ సినిమాల ప్రేమికులకు గుర్తుండిపోయే చిత్రంగా నిలిచిన ‘డీమాంటి కాలనీ’ భారీ విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. 2015లో విడుదలైన ఈ సినిమాకు అజయ్ జ్ఞానముత్తు(Ajay Gnanamuthu) దర్శకత్వంలో తెరకెక్కగా.. హీరోగా అరుల్‌నిధి తమిళరసన్ నటించారు. నిజ జీవిత ఘటనల ఆధారంగా రూపొందిన ఈ సినిమా భయానక వాతావరణం, థ్రిల్లింగ్ స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ విజయానికి కొనసాగింపుగా రూపొందిన ‘డీమాంటి కాలనీ 2’ కూడా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఈ పార్ట్‌లో కూడా అరుల్‌నిధి ప్రధాన పాత్రలో కనిపించగా, హీరోయిన్‌గా ప్రియా భవానీ శంకర్ నటించారు. కథను మరింత డీప్‌గా తీసుకెళ్లుతూ హారర్, మిస్టరీ, ఎమోషన్‌లను కలిపి ప్రేక్షకులను మంత్రముగ్దులను చేశారు.

ముఖ్యంగా క్లైమాక్స్ ఎండింగ్ మూడో భాగానికి బలమైన హింట్ ఇచ్చింది.ఇప్పటికే ఈ సినిమాకు మూడో పార్ట్ రాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఫ్రాంచైజ్‌కు మూడో భాగంగా ‘డీమాంటి కాలనీ- 3’ (DemonteColony3)ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఆ పోస్టర్ పూర్తిగా డార్క్ టోన్‌లో, మిస్టీరియస్ వాతావరణంతో వెన్నులో వణుకు పుట్టించేలా రూపొందించారు. పోస్టర్ చూస్తే ఈసారి భయాన్ని మరో స్థాయికి తీసుకెళ్లబోతున్నారనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ‘డీమాంటి కాలనీ – 3’కి కూడా దర్శకత్వం వహించేది అజయ్ జ్ఞానముత్తునే కాగా, హీరోగా మరోసారి అరుల్‌నిధి తమిళరసన్, ప్రియా భవానీ శంకర్ నటించనున్నట్లు సమాచారం. షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్ స్పెషల్‌గా థియేటర్స్‌లోకి రానుంది.

Read More..

ప్రభాస్ చేసిన పనికి సెట్‌లో కంట్రోల్‌లో ఉండలేకపోయాను.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

Next Story