- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రభాస్ చేసిన పనికి సెట్‌లో కంట్రోల్‌లో ఉండలేకపోయాను.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్
యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: యంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్(Nidhi Agarwal) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ‘సవ్యసాచి’(Savyasachi) సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైన ఈ చిన్నది రీసెంట్‌గా పవర్ స్టార్ ప్రభాస్ నటించిన ‘హరిహర వీరమల్లు;(HariHara Veeramallu) సినిమాతో మన ముందుకు వచ్చింది. ప్రస్తుతం మారుతి(Maruti) దర్శకత్వం వహిస్తున్న 'ది రాజా సాబ్' మూవీలో నటిస్తోంది. ఇందులో ప్రభాస్(Prabhas) హీరోగా నటిస్తుండగా నిధి అగర్వాల్, రిద్ధి కుమార్, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే ఈ చిత్రం జనవరి 9న థియేటర్లలో రిలీజ్ కానుంది.ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నిధి అగర్వాల్… హీరో ప్రభాస్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకుంది. ఆమె మాట్లాడుతూ.. ‘మితాహారం ఎవరికైనా అగ్ని పరీక్షే. ముఖ్యంగా మేమైతే ఇష్టమైన ఫుడ్‌ని ధైర్యంగా తినలేం. తిండిని తగ్గించుకుంటేనే ఇక్కడ ఎక్కువ కాలం ఉండగలుగుతాం. కానీ ‘ది రాజాసాబ్’ సెట్‌లో మాత్రం నేను కంట్రోల్‌లో ఉండలేకపోయా. నేనేకాదు.. నా తోటి హీరోయిన్లు ఇద్దరూ కూడా. దానికి కారణం ప్రభాస్.
ఆయన ఎదుటివారి డైట్ చెడగొట్టడంలో ముందుంటారు. కానీ ఆయన మాత్రం సెట్‌లో ఫ్రూట్స్ మాత్రమే తింటారు. ప్రతిరోజు ప్రభాస్ ఇంటి నుంచి ఓ క్యారియర్ వస్తుంది. అందులో సుమారు పది రకాల ఐటమ్స్ ఉంటాయి. వాటి స్మెల్ చూశాక తినకుండా ఉండలేం. భోజనప్రియులు రెండు రకాలుంటారు. వారిలో తింటానికి ఇష్టపడేవారు కొందరైతే.. తినిపించడానికి ఇష్టపడేవారు కొందరు. ప్రభాస్ రెండో టైప్. ఆయన తినిపించి ఆనందపడుతుంటారు’ అని నవ్వుకుంటూ చెప్పుకొచ్చింది నిధి అగర్వాల్. ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.
Read More..
నా మీద ఈర్ష్యతో వాళ్లు అలా చేస్తున్నారు.. సంచలన నిజాలు బయటపెట్టిన మారుతి!






