నా మీద ఈర్ష్యతో వాళ్లు అలా చేస్తున్నారు.. సంచలన నిజాలు బయటపెట్టిన మారుతి!

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-02 03:25:30  IST  )

మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ (the rajasaab) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి.

నా మీద ఈర్ష్యతో వాళ్లు అలా చేస్తున్నారు.. సంచలన నిజాలు బయటపెట్టిన మారుతి!
X

దిశ, సినిమా: మారుతి(Maruthi) దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా చిత్రం ‘ది రాజాసాబ్’ (the rajasaab) పై అంచనాలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తుండగా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ (TG Vishwaprasad)ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మారుతి కెరీర్‌లోనే ఇది బిగ్గెస్ట్ ప్రాజెక్ట్‌గా భావిస్తుండగా, షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే టైటిల్, కాన్సెప్ట్ విషయంలో ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.ఈ నేపథ్యంలో గత కొన్ని రోజులుగా దర్శకుడు మారుతి వరుసగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనకు యాంకర్ నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. “ఇండస్ట్రీలో చాలామంది మీరు ఈసారి ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నారట.

అందరిది అలాంటి మనస్తత్వమే..

ప్రభాస్‌తో సినిమా చేసే ఛాన్స్ రావడమే ఇందుకు కారణమా? లేక జెలసీ వల్లనా?” అని నేరుగా ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు మారుతి చాలా ఓపెన్‌గా, కాస్త ఘాటుగానే స్పందించారు. ఇంకా మారుతి మాట్లాడుతూ..“ఎవరికైనా తమకు నచ్చినట్లు కోరుకునే హక్కు ఉంటుంది. దాన్ని మనం ఆపలేం. పక్కింటివాడు కొత్త కారు కొంటే అది యాక్సిడెంట్ అవ్వాలని కోరుకునే వాళ్లూ ఉంటారు. ఈర్ష్య, అసూయ అనేవి మానవ సహజ లక్షణాలే. నాకు మాత్రమే అవకాశాలు రావాలి, నన్నే అందరూ ప్రేమించాలి అనుకునే మనస్తత్వం చాలా మందిలో ఉంటుంది” అని అన్నారు. అలాగే తను ఫెయిల్యూర్ అవ్వాలనుకుంటున్నారో చెప్తాడు. ‘‘వాడికి సక్సెస్ వస్తే మనకు దొరకడేమో, మన దగ్గరికి రాడేమో అన్న భయం కూడా కొందరిలో ఉంటుంది. నేను చిన్న సినిమాల ఈవెంట్లకు ఇప్పటికీ వెళ్తుంటాను. కానీ నాకు పెద్ద సక్సెస్ వస్తే, పిలిస్తే వెళ్లనేమో అని వాళ్లకు అనిపిస్తుంటుంది. అందుకే ఈసారి వీడు పడిపోతే బాగుంటుంది అనుకుంటారు.

నేను ఎదగకూడదనే ఇదంతా..

ఒక మనిషి ఎదిగితే ఇగో పెరుగుతాడేమో, మనుషులను దూరం పెడతాడేమో అన్న అనుమానమే వాళ్ల ఆలోచనలకు కారణం” అని స్పష్టంగా చెప్పారు. అంతేకాదు, “ఈసారి కథ చెప్పడానికి వస్తే దొరకడేమో అన్న భయంతోనే వాడికి ఓ దెబ్బ తగిలితే బాగుంటుందని లోపల ఒక ఉద్దేశం ఉండొచ్చు. కానీ నా ఫెయిల్యూర్ వాళ్లకు అన్నం పెట్టదు. నేను పడిపోతే వాళ్ల జీవితం మారిపోదు. అందుకే నేను పడిపోవాలని కాదు.. వాళ్ల ఆలోచనలే పడిపోవాలి అనుకుంటున్నాను. ఈసారి నేను కింద పడను.. వాళ్లను పడేయాలనుకుంటున్నా” అంటూ గట్టిగా స్పందించారు. ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో ఆయనకు ఎవరి మీద అసహనం ఉందనే చర్చ మొదలైంది. అసలు మారుతితో విభేదాలు ఉన్నవారు ఎవరు? ఆయన ఈ మాటలు ఎవరిని ఉద్దేశించి అన్నాడు? అంటూ నెటిజన్లు చర్చించుకుంటున్నారు.

Read More..

ప్రభాస్ చేసిన పనికి సెట్‌లో కంట్రోల్‌లో ఉండలేకపోయాను.. నిధి అగర్వాల్ షాకింగ్ కామెంట్స్

Next Story