ఓటీటీలోకి రాబోతున్న మిస్టికల్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-16 03:01:47  IST  )

హిట్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్(Aadi Saikumar) కెరీర్‌కు ‘శంబాల’ (Shambhala)కొత్త ఊపునిచ్చింది.

ఓటీటీలోకి రాబోతున్న మిస్టికల్ థ్రిల్లర్..స్ట్రీమింగ్ తేదీపై అధికారిక ప్రకటన విడుదల
X

దిశ, సినిమా: హిట్ కోసం కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఆది సాయికుమార్(Aadi Saikumar) కెరీర్‌కు ‘శంబాల’ (Shambhala)కొత్త ఊపునిచ్చింది. యుగంధర్ ముని దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడికల్ స్పోర్ట్స్ డ్రామా ప్రేక్షకుల మనసులు గెలుచుకుంది. షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై రాజశేఖర్ అన్నమోజు, మహిధర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాలో అర్చన అయ్యర్(Archana Iyer), రవివర్మ, స్వాసిక కీలక పాత్రల్లో నటించారు. సినిమా టీజర్, ట్రైలర్‌ను పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ విడుదల చేయడంతో ‘శంబాల’పై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను అందుకుంటూ డిసెంబర్ 25న క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది.

స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో నడిచే కథ, ఎమోషనల్ సీన్స్, ఆది సాయికుమార్ నటన ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. థియేటర్లలో ఘన విజయం సాధించిన ‘శంబాల’ ఇప్పుడు ఓటీటీలో సందడి చేయడానికి సిద్ధమైంది. ఈ సినిమాకు సంబంధించిన డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా దక్కించుకోగా.. జనవరి 22 నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి రానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇక గోల్డ్ సబ్‌స్క్రిప్షన్ ఉన్న వీక్షకులు జనవరి 21 నుంచే ఈ సినిమాను వీక్షించే అవకాశం ఉందని ఆహా వెల్లడించింది. దీంతో థియేటర్ మిస్ అయినవారు, మరోసారి చూడాలనుకునే అభిమానుల్లో ఉత్సాహం పెరిగింది.

Read More..

ఓటీటీలోకి వచ్చిన శివాజీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Next Story