- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓటీటీలోకి వచ్చిన శివాజీ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
టాలెంటెడ్ యాక్టర్ శివాజీ(Shivaji), బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘దండోరా’(Dandora).

దిశ, వెబ్‌డెస్క్: టాలెంటెడ్ యాక్టర్ శివాజీ(Shivaji), బిందు మాధవి(Bindu Madhavi) ప్రధాన పాత్రలో నటించిన మూవీ ‘దండోరా’(Dandora). ఇక ఇందులో నవదీప్(Navdeep), నందు(Nandu), రవికృష్ణ(Ravi Krishna), మనికా చిక్కాల(Manika Chikkala), మౌనికా రెడ్డి(Mounika Reddy), రాధ్య(Radhya), అదితి భావరాజు(Adithi Bhavaraju) తదితరులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి మురళీకాంత్(Murali Kanth) దర్శకత్వం వహించాడు. తెలంగాణ పల్లెటూరి నేపథ్యం, కుల వివక్ష వంటి సున్నితమైన సామాజిక అంశంతో తెరకెక్కిన ‘దండోరా’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.
ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి బజ్ క్రియేట్ చేసిన ఈ సినిమాపై, విడుదలకి ముందు నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిని పెంచాయి. అయితే థియేటర్లలో అలరించిన ఈ చిత్రం తాజాగా ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయినటువంటి అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం నేటి నుంచి తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో స్ట్రీమింగ్ అవుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం ఓటీటీ ప్రియులు అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ చిత్రాన్ని చూసేయండి.






