కుర్రకారుకు హాట్ ట్రీట్.. పొట్టి నిక్కర్‌లో దర్శనమిచ్చి చెమటలు పట్టిస్తున్న బాలయ్య బ్యూటీ

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-09 07:35:44  IST  )

‘అఖండ’ సినిమాతో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఫేట్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు.

కుర్రకారుకు హాట్ ట్రీట్.. పొట్టి నిక్కర్‌లో దర్శనమిచ్చి చెమటలు పట్టిస్తున్న బాలయ్య బ్యూటీ
X

దిశ, సినిమా: ‘అఖండ’ సినిమాతో ప్రగ్యా జైస్వాల్(Pragya Jaiswal) ఫేట్ మారిపోయిందనడంలో అతిశయోక్తి లేదు. ఆ మూవీ ఇచ్చిన సక్సెస్‌తో ఆమెకు టాలీవుడ్‌లో ఫుల్ పాపులారిటీ ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన ‘డాకు మహారాజు’ కూడా బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించడంతో ప్రగ్యా పేరు మాస్ సర్కిల్స్‌లో మరింత బలంగా వినిపించింది. ఇక ఇటీవల విడుదలైన ‘అఖండ–2’(Akhanda–2) కూడా హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఆమె కెరీర్ పూర్తిగా కొత్త మలుపు తిరిగిందని చెప్పొచ్చు. బాలకృష్ణ సినిమాలకు ఆమె లక్కీ చార్మ్‌గా మారిందనే మాటలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రగ్యా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ (Sai Srinivas)హీరోగా తెరకెక్కుతున్న ‘టైసన్ నాయుడు’ సినిమాలో నటిస్తోంది.

ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా, ఇందులో ప్రగ్యా పాత్ర కథకు కీలకంగా ఉంటుందనే టాక్ వినిపిస్తోంది. వరుస హిట్స్‌తో అవకాశాలు క్యూ కడుతుండటంతో ఆమె జోరు ఏమాత్రం తగ్గడం లేదు. సినిమాలతో పాటు సోషల్ మీడియాలోనూ ప్రగ్యా స్పీడ్ పెంచింది. తరచూ స్టైలిష్, హాట్ ఫొటోలు షేర్ చేస్తూ నెట్టింట ట్రెండింగ్‌లో ఉంటోంది. తాజాగా, ప్రగ్యా పొట్టి నిగ్గర్‌లో దర్శనమిచ్చి ఫొటోలు అభిమానుల్లో హీట్ పెంచాయి. గ్లామర్ లుక్‌లో ఆమె ఇచ్చిన ట్రీట్‌కు సోషల్ మీడియా కుర్రకారు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మొత్తానికి ప్రగ్యా జైస్వాల్ పేరు సోషల్ మీడియాలో మార్మోగిపోతోంది.

Read More..

వేరే పనికొచ్చే న్యూసులు పెట్టుకోండ్రా బాబు.. టాలీవుడ్ నటి సీరియస్ పోస్ట్

Next Story