- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వేరే పనికొచ్చే న్యూసులు పెట్టుకోండ్రా బాబు.. టాలీవుడ్ నటి సీరియస్ పోస్ట్
టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు.

దిశ, వెబ్‌డెస్క్: టాలీవుడ్ యాంకర్ కమ్ నటి అనసూయ(Anasuya) గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన పనిలేదు. ఈ భామ జబర్దస్త్(Jabardasth) కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్ షో ద్వారా ఎంతో పేరు సంపాదించుకుంది. దీంతో ఈ చిన్నదానికి సినిమాల్లో నటించే అవకాశం వచ్చింది. అలా రామ్ చరణ్(Ram Charan) నటించిన ‘రంగస్థలం’(Rangasthalam) మూవీలో రంగమ్మత్తగా నటించి మెప్పించింది. దీంతో అక్కడి నుంచి ఆమె కెరీర్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఆ తర్వాత కూడా ‘పుష్ప’(Pushpa), ‘పుష్ప-2’(Pushpa-2) వంటి భారీ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది.
ఇటీవల వచ్చిన అరి వంటి సినిమాల్లో.. కూడా ఆమె నటన ప్రత్యేకంగా నిలిచింది. ఇదిలా ఉంటే.. అనసూయ సోషల్ మీడియా(Social Media)లో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. నిత్యం ఫొటోలు, వీడియోలు పంచుకుంటూ.. తన అభిమానులతో తరచూ కమ్యూనికేట్ అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో ఈ భామ పోస్ట్ నెట్టింట వైరల్‌గామారింది. తాజాగా అనసూయ తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ స్టోరీ పెట్టింది. అందులో.. ‘రేయ్ రేయ్.. ఇంకేంత ట్విస్ట్ చేస్తార్రా మాటలను.. ఎవరు యూ టర్న్ తీసుకున్నారు. ఎవరు దిగొచ్చారు. ఎవరు ఎట్టకేలకు తప్పు ఒప్పుకున్నారు. ఇంకా ఇంతేనా మీ గతి.. వేరే పనికొచ్చే న్యూస్/డిస్కషన్ పెట్టుకోండ్రా బాబు’ అని రాసుకొస్తూ తల పట్టుకున్న వీడియో షేర్ చేసింది.
కాగా నిన్న ఓ నెటిజన్ మేడమ్ శివాజీ చెప్పిన పాయింట్ కరెక్ట్ కానీ అతను వాడిన రెండు పదాలు మాత్రం బ్యాడ్‌గా ఉన్నాయి. దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అని అడిగినప్పుడు ఆమె.. ‘శివాజీ ఎంతో కష్టపడి, మంచి పాత్రలు పోషించి, ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు.. మహిళల భద్రత గురించి ఆయన మాట్లాడిన విధానం వెనుక ఉన్న ఉద్దేశం మంచిదే.. కానీ కేవలం అమ్మాయిలను హెచ్చరించడమే కాకుండా, అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తుచేసేలా మాట్లాడి ఉంటే బాగుండేది’ అని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చాలామంది ఎట్టకేలకు అనసూయ తప్పు ఒప్పుకుంది అని చాలా మంది సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దీంతో ఆమె ఈ స్టోరీ పెట్టినట్లు తెలుస్తోంది.
Read More..
Anasuya: అటెన్షన్ కోసం పరువు తీసుకున్నావంటూ నెటిజన్ పోస్ట్.. స్ట్రాంగ్‌గా ఇచ్చిపడేసిన అనసూయ






