ప్రభాస్‌తో నటించలేదని ఏడుస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. రాజాసాబ్ టైటిల్ మర్చిపోవడంతో ఆడేసుకుంటున్న నెటిజన్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-01-10 08:43:45  IST  )

‘ఆర్ఎక్స్100’ సినిమాతోనే పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను అందుకుంది.

ప్రభాస్‌తో నటించలేదని ఏడుస్తున్న టాలీవుడ్ హీరోయిన్.. రాజాసాబ్ టైటిల్ మర్చిపోవడంతో ఆడేసుకుంటున్న నెటిజన్స్
X

దిశ, సినిమా: ‘ఆర్ఎక్స్100’ సినిమాతోనే పాయల్ రాజ్‌పుత్(Payal Rajput) ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను అందుకుంది. తొలి సినిమానే గ్లామర్, బోల్డ్ నటనతో యూత్‌ను ఆకట్టుకుని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత ‘వెంకీ మామ’లో సింపుల్ టీచర్ పాత్రలో కనిపించి తన నటన వైవిధ్యాన్ని చూపించింది. అలాగే ‘మంగవారం’ సినిమాతో మంచి హిట్ అందుకుని మళ్లీ ఫామ్‌లోకి వచ్చినట్లు అనిపించింది. అయితే 2024లో లేడీ ఓరియెంటెడ్ కథతో వచ్చిన ‘రక్షణ’ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఈ సినిమా ఫలితంతో పాయల్ కెరీర్‌పై ప్రభావం పడినట్లు కనిపిస్తోంది. గత కొంతకాలంగా కొత్త ఆఫర్లు పెద్దగా లేకపోవడంతో.. సోషల్ మీడియాపై ఫుల్ ఫోకస్ పెట్టి నిత్యం పలు పోస్టులు షేర్ చేస్తోంది.

తాజాగా, పాయల్ ఓ ఫన్నీ వీడియోతో ట్రోలింగ్ ఎదుర్కొంటుంది. ప్రభాస్(Prabhas) ‘రాజాసాబ్’ సినిమాలో నటించేందుకు ఎంపిక కానప్పుడు అంటూ ఏడుస్తూ.. కన్నీటిని తుచుకున్నట్లు చేసిన వీడియోను షేర్ చేసింది. ఇక ఇందులో రాజాసాబ్‌(Raja Saab)కు బదులుగా.. మూవీ పేరును తప్పుగా.. రాజాసాహెబ్ అనడంతో అంతా ట్రోల్ చేస్తున్నారు. మా అన్న మూవీ పేరు మర్చిపోయావ్? నిజంగా చెప్తున్నవా.. హిట్ కాలేదు కాబట్టి నటించకుండా తప్పించుకున్నాను అని హేళన చేస్తున్నావా? అని అంటున్నారు. మరికొందరు మాత్రం పాజిటివ్‌గా స్పందిస్తున్నారు. కచ్చితంగా త్వరలో అవకాశం వస్తుందిలే అని కామెంట్లు చేస్తున్నారు. మొత్తానికి నవ్వించాలనుకుని చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారి, పాయల్ ట్రోలింగ్‌కు గురైంది.

Read More..

రాజా సాబ్ ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే..?

Next Story