- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Ram Charan: గ్లోబల్ స్టార్ బర్త్ డే స్పెషల్.. అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్న ‘పెద్ది’ గ్లింప్స్
ఇక ఈ వీడియోలో వినిపిస్తున్న డైలాగ్స్ మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి. "పెద్ది అంటే చావుకు ఎదురెళ్లే ఆట.. ఆటే నా పొగరు" అని చరణ్ తనదైన యాసలో చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా కాంబినేషన్‌లో రాబోతున్న భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ‘పెద్ది’. నేడు చరణ్ పుట్టినరోజును పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన స్పెషల్ గ్లింప్స్ సోషల్ మీడియాను ఊపేస్తోంది. ఈ సినిమాలో చరణ్ మునుపెన్నడూ లేని విధంగా ఒక రా అండ్ రస్టిక్ లుక్‌లో కనిపిస్తున్నారు. ఈ గ్లింప్స్‌లో రామ్ చరణ్ తన బాడీని మలిచిన తీరు అద్భుతంగా ఉంది. కఠినమైన కసరత్తులు చేస్తూ, సిక్స్ ప్యాక్ బాడీతో ఆయన కనిపిస్తున్న విజువల్స్ అభిమానులకు పూనకాలు తెప్పిస్తున్నాయి. ముఖ్యంగా హనుమాన్ చేతిలోఉండే గద పట్టుకుని శత్రువులను వేటాడుతున్న తీరు చూస్తుంటే, ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ ఏ రేంజ్‌లో ఉంటాయో అర్థమవుతోంది. ఇక ఈ వీడియోలో వినిపిస్తున్న డైలాగ్స్ మూవీపై అంచనాలను ఒక్కసారిగా పెంచేశాయి.
" కుస్తీ అంటే బంతితో బ్యాటుకు ఎదురేళ్లు ఆట కాదురా.. ప్రాణంతో చావుకు ఎదురెళ్లే ఆట.. ఆటే నా పొగరు" అని చరణ్ తనదైన యాసలో చెప్పడం చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. అలాగే శత్రువులను హెచ్చరిస్తూ.. "ఇప్పుడు సెప్పు.. ఉంటావా.. పోతావా?" అని చెప్పే డైలాగ్ థియేటర్లలో విజిల్స్ వేయించేలా ఉంది. చరణ్ వాయిస్ బేస్, ఆటిట్యూడ్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా.. గ్లింప్స్‌లో వినిపిస్తున్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ విజువల్స్‌ను మరో లెవల్‌కు తీసుకెళ్లింది. బుచ్చిబాబు సనా తన మొదటి సినిమా ‘ఉప్పెన’తోనే తన మార్క్ చూపించారు. ఇక ఇప్పుడు ‘పెద్ది’తో చరణ్‌ను ఒక పవర్‌ఫుల్ స్పోర్ట్స్ డ్రామాలో చూపించబోతున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్‌కు జోడీగా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఉత్తరాంధ్ర నేపథ్యంలో సాగే ఈ కథలో చరణ్ ఒక అథ్లెట్‌గా కనిపించబోతున్నారని సమాచారం. నేడు విడుదలైన ఈ చిన్న వీడియోతోనే సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి.
కంటిపైన బ్యాండేజ్‌తోనే రామ్ చరణ్..వీడియో వైరల్






