కంటిపైన బ్యాండేజ్‌తోనే రామ్ చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్

by velandi.Saikiran |   (  Updated:2026-03-27 04:26:27  IST  )

కంటిపైన బ్యాండేజ్ తోనే ఫ్యాన్స్ తో క‌లిసి సెల్ఫీలు దిగారు రామ్ చ‌ర‌ణ్‌.

కంటిపైన బ్యాండేజ్‌తోనే రామ్ చ‌ర‌ణ్‌..వీడియో వైర‌ల్
X

దిశ‌, వెబ్ డెస్క్: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పడలేదు. మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందిపుచ్చుకొని ఇండస్ట్రీలో అడుగుపెట్టిన రామ్ చరణ్, తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇండస్ట్రీని ఒక ఊపు ఊపుతున్నారు. RRR లాంటి బంపర్ హిట్ సినిమా పడిన తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు చరణ్. ఇక ఇదే ఊపులో ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నారు. ఈ సినిమా ఈ సమ్మర్ లోనే రిలీజ్ కానుంది. అయితే ఈ సినిమా షూటింగ్ సందర్భంగా రామ్ చరణ్ కంటికి గాయమైన సంగతి తెలిసిందే.

అయితే కంటికి చికిత్స తీసుకున్న తర్వాత లేటెస్ట్ గా పెద్ది మూవీ షూటింగ్ కు మళ్ళీ హాజరయ్యారు రామ్ చరణ్. ఏ మాత్రం రెస్ట్ తీసుకోకుండా సెట్ కు వచ్చారు. తన పుట్టిన రోజు ఉన్న నేపథ్యంలో విష్ చేసేందుకు వచ్చిన ఫ్యాన్స్ ను కలిశారు రామ్ చరణ్. వారితో కలిసి సెల్ఫీ వీడియో కూడా తీసుకున్నారు. తాను క్షేమంగానే ఉన్నానని ఈ సందర్భంగా తెలిపారు. తన కంటికి గాయంపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని వివరించారు. అయితే అభిమానులతో కలిసినప్పుడు రాంచరణ్ కంటికి బ్యాండేజ్ ఉంది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి. ఇది చూసిన ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.

రామ్ చరణ్‌ గాయాలపై స్పందించిన పెద్ది యూనిట్… మెగా ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చిన అప్డేట్!

Next Story