రామ్ చరణ్‌ గాయాలపై స్పందించిన పెద్ది యూనిట్… మెగా ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చిన అప్డేట్!

by Pulgam srinivas |

రామ్ చరణ్‌ గాయాలపై స్పందించిన పెద్ది యూనిట్

రామ్ చరణ్‌ గాయాలపై స్పందించిన పెద్ది యూనిట్… మెగా ఫ్యాన్స్‌కు ఊరటనిచ్చిన అప్డేట్!
X

దిశ, సినిమా: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం నటిస్తున్న 'పెద్ది' సినిమా షూటింగ్ సమయంలో స్వల్ప ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఆయన అభిమానులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఇదిలా ఉండగా, తాజాగా 'పెద్ది' యూనిట్ రామ్ చరణ్ ఆరోగ్య పరిస్థితిపై అధికారిక ప్రకటన విడుదల చేసింది. రామ్ చరణ్ పూర్తిగా సురక్షితంగా ఉన్నారని, ఆయన ఆరోగ్యం విషయంలో ఎలాంటి ఆందోళన అవసరం లేదని స్పష్టం చేసింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో రామ్ చరణ్ ఎడమ కన్నుకు చిన్న గాయం అయినట్లు, వెంటనే వైద్య చికిత్స అందించడంతో ప్రస్తుతం ఆయన పూర్తిగా కోలుకున్నారని తెలిపారు.

గాయం చిన్నదే కావడంతో ఎలాంటి సమస్య లేదని, అలాగే రామ్ చరణ్ రేపటినుంచి మళ్లీ షూటింగ్‌లో పాల్గొననున్నట్లు యూనిట్ తెలిపింది. అభిమానులు ఆయన ఆరోగ్యం గురించి అస్సలు కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా స్పష్టం చేశారు. రామ్ చరణ్‌కు యాక్సిడెంట్ జరిగిందని తెలిసిన వెంటనే ఆయన అభిమానులు కంగారు పడ్డారు. అయితే తాజాగా వచ్చిన ఈ అప్డేట్‌తో వారు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.




Next Story