Vijay : తలపతి విజయ్‌పై నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు

by Disha Web Desk 1 |
Vijay : తలపతి విజయ్‌పై నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదు
X

దిశ, వెబ్ డెస్క్ : తలపతి విజయ్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో 'లియో' మూవీ చేస్తున్నాడు. ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 19, 2023న థియేటర్లలోకి రానుంది. తాజాగా తలపతి విజయ్‌పై నార్కోటిక్స్ నియంత్రణ చట్టం కింద కేసు నమోదైంది. ఇటీవలే 'నా రెడీ' అనే పాటను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. అయితే, ఈ పాటకు ఇప్పటికే ప్రేక్షకుల నుంచి భారీగా రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను తలపతి విజయ్ పాడగా, అనిరుధ్ రవిచందర్ సంగీతాన్ని అందించారు. అయితే, ఈ సాంగ్ లో మత్తు పదార్థాల వినియోగం, రౌడీయిజం కనిపిస్తోందని పేర్కొంటూ చెన్నైలోని ఓ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్త సెల్వ ఆర్టీఐ కోర్టును ఆశ్రయించారు. జూన్ 25న ఆన్‌లైన్‌లో తన పిటిషన్‌ను సమర్పించగా, జూన్ 26న తన వ్యాజ్యాన్ని దాఖలు చేశాడు.

Read More..

పవన్ కల్యాణ్ సినిమాలో అన్నయ్య-వదిన సెంటిమెంట్.. ఫ్యాన్స్‌కి పండగే!

ఇండియాలోనే ‘హాటెస్ట్ నైట్ గర్ల్’.. ఆమె ఒక్క నైట్‌ ధర రూ.40 లక్షలు

Next Story

Most Viewed