- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- కార్టూన్
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- Bigg Boss Telugu 7
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- ఫోటోలు
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- Telangana Assembly Election 2023
- ICC World Cup 2023
Trivikram Srinivas మ్యాజిక్‌కు 21 ఏళ్లు.. ఆ సీన్ ఎప్పటికీ అద్భుతమే

శ, వెబ్‌డెస్క్: తెలుగు సినీ అభిమానులకు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. హీరోలతో సంబంధం లేకుండా ఆయన సినిమా చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడి పోతుంటారు. రక్తపాతాలు, యుద్ధాలు లాంటి భయంకరమైన సీన్లు లేకుండా.. చిన్న లాజికల్ పాయింట్‌తో ప్రేక్షకులను కట్టిపడేస్తుంటారు. ఇండస్ట్రీలోని టాప్ హీరోలు అయిన పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్‌తో హిట్లు కొట్టడమే కాకుండా యంగ్ హీరో నితిన్‌తోనూ అద్భుతమైన(అఆ) చిత్రం తీసి సత్తా చాటారు. త్రివిక్రమ్ తీసే సినిమాలు ఎన్నేళ్లైనా అయినా అభిమానుల గుండెళ్లో నిలిచిపోతాయి. అలాంటి జాబితాలోకే వస్తుంది విక్టరీ వెంకటేశ్ నటించిన 'నువ్వు నాకు నచ్చావ్' సినిమా. ఈ సినిమాతో త్రివిక్రమ్ స్థాయి మరో లెవెల్‌కు వెళ్లిందనటంతో ఎలాంటి సందేహం లేదు. ఈ సినిమా విడుదలై సరిగ్గా నేటికి 21 ఏళ్లు పూర్తయింది.
విక్టరీ వెంకటేశ్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆర్తి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. విజయ్ భాస్కర్ దర్శకత్వం వహించగా, స్రవంతి రవికిషోర్ నిర్మించారు. సెప్టెంబర్ 6, 2001లో విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. ముఖ్యంగా ప్రశాశ్ రాజ్ అమ్మ కోసం రాసుకున్న కవితను డిన్నర్‌లో టైమ్‌లో దేవుడి మీద ఒట్టేసి చెప్పడం సినిమాకే హైలెట్ అని చెప్పొచ్చు. ఈ సినిమా పంచిన నవ్వులతో అప్పట్లో కుటుంబాలకు కుటుంబాలే థియేటర్లకు క్యూ కట్టాయి. 57 కేంద్రాలో 100 రోజులు విజయవంతంగా ప్రదర్శించడంతో పాటు, మూడు థియేటర్లలో 175 రోజులు ఆడి అద్భుతం సృష్టించింది. అయితే, ఈ సినిమా విడుదలై 21 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా అభిమానులు సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. ఈ సినిమా సమయంలో జరిగిన అనుభవాలను నెట్టింట్లో గుర్తు చేసుకుంటున్నారు.
Also Read : బాడీ ఫిట్‌నెస్ కోసం మహేశ్ బాబు కసరత్తులు..
Also Read: Nandamuri Balakrishna - Gopichand Malineni సినిమాకు 'జై బాలయ్య' టైటిల్?