2022 చివరి నాటికి 70,000కు సెన్సెక్స్: మోర్గాన్ స్టాన్లీ!

by  |
ridham desai
X

దిశ, వెబ్‌డెస్క్: అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు సంబంధించి భారతీయ స్టాక్ మార్కెట్ల పనితీరు 2022లో నెమ్మదించవచ్చని ఓ నివేదిక తెలిపింది. అయితే బీఎస్ఈ సెన్సెక్స్ 2022 చివరి నాటికి 70,000 మార్కును తాకుతుందని మోర్గాన్ స్టాన్లీ నివేదిక అభిప్రాయపడింది. దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలు, పాలసీ మద్దతు, బలమైన వృద్ధి, స్థూల గణాంకాల స్థిరత్వం మార్కెట్ల ర్యాలీకి సహాయంగా ఉండనున్నాయి. ‘రాబోయే రెండేళ్లలో కార్పొరేట్ కంపెనీల ఆదాయం ఏటా 27 శాతం పెరుగుతుందని, సెన్సెక్స్ 16 శాతం పెరిగి 70 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నాం’ అని మోర్గాన్ స్టాన్లీ ఈక్విటీ స్ట్రాటజిస్ట్ రిధమ్ దేశాయ్ అన్నారు.

ప్రస్తుతం సెన్సెక్స్ ఉన్న 59,636 స్థాయిలతో పోలిస్తే ఇది 17 శాతం పెరుగుదలను సూచిస్తుంది. సెన్సెక్స్ ఇండెక్స్ 2020లో కరోనా మహమ్మారి సమయంలో పతనమైన తర్వాత ఇప్పటివరకు 120 శాతం లాభపడింది. రాబోయే కేలండర్ ఏడాదిలో ప్రధానంగా క్లీన్ ఎనర్జీ ఖర్చులు, కొత్త నివాస ఆస్తులు, ఆటో పరిశ్రమ, విమానయాన రంగం, ఆర్థిక రంగంలో క్రెడిట్ సౌకర్యం, లైఫ్ ఇన్సురెన్స్, డిజిటలీకరణ, హైపర్-లోకల్ కామర్స్, ఈ-వాహనాలు మార్కెట్లను ప్రభావితం చేయవచ్చని రిధమ్ దేశాయ్ వెల్లడించారు.

Next Story

Most Viewed