అఖండ సినిమా సభ్యులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఆల 

by  |
అఖండ సినిమా సభ్యులకు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యే ఆల 
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ప్రేక్షకుల ఆదరణ తో దిగ్విజయంగా ప్రదర్శించబడుతున్న అఖండ యూనిట్ సభ్యులను దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, షాద్‌నగర్ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ తో కలిసి శనివారం రాత్రి అభినందనలు తెలిపారు. షాద్ నగర్‌లో ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్‌కు రవీందర్ రెడ్డి ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ వెళ్లారు. అఖండ సినిమా విజయం సాధించిన నేపథ్యంలో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్ రెడ్డి, అంజయ్య యాదవ్ సినీ హీరో నందమూరి బాలకృష్ణకు అలాగే దర్శకుడు బోయపాటి శ్రీనివాస్‌కు అభినందనలు తెలిపారు.

Next Story

Most Viewed