అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ ఓకే చేసిన శ్రుతి.. తన చుట్టే అల్లుకున్న కథ!

by  |
అమెజాన్ ఒరిజినల్ సిరీస్‌ ఓకే చేసిన శ్రుతి.. తన చుట్టే అల్లుకున్న కథ!
X

దిశ, సినిమా: ప్రముఖ నటుడు మిథున్ చక్రవర్తి ఒక దశాబ్దానికి పైగా సినిమాలతోపాటు వివిధ రియాల్టీ షోలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించాడు. అయితే ఈ స్టార్ నటుడు తాజాగా ఓ వెబ్‌‌సిరీస్‌లో నటించేందుకు అంగీకరించినట్లు తెలిపాడు. తన నటనా జీవితంలో ఇదొక కొత్త అధ్యాయంగా భావిస్తున్నట్లు తెలిపిన ఆయన.. తనతో పాటు స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్ కూడా ఈ సిరీస్‌లో నటించనున్నట్లు చెప్పాడు. అమెజాన్ ప్రైమ్ ఒరిజినల్‌గా వస్తున్న సిరీస్ గురించి చెప్పగానే.. నో చెప్పలేకపోయాడని అన్నాడు. శ్రుతి హాసన్ పాత్ర చుట్టూ స్టోరీ కేంద్రీకృతమై ఉంటుదన్న మేకర్స్.. ఆమె ఒక రహస్యమైన మహిళ పాత్రను పోషించనున్నట్లు పేర్కొన్నారు. ఇక ఈ సిరీస్ ముకుల్ దర్శకత్వంలో రానుండగా.. రచయిత రవి సుబ్రమణియన్ నవల ‘ది బెస్ట్ సెల్లర్ షీ రాట్’ ఆధారంగా సిద్ధార్థ్ మల్హోత్రా కీర్తి నిర్మాణంలో తెరకెక్కుతోంది. అర్జున్ బజ్వా, గౌహర్ ఖాన్, సత్యజీత్ దూబే ముఖ్యపాత్రలు పోషించనున్న సిరీస్ టైటిల్ త్వరలోనే ప్రకటించనున్నారు మేకర్స్.

360°లో అందాలను చూపించిన నటి.. నెటిజన్లు ఫైర్


Next Story

Most Viewed