మంత్రి కేటీఆర్‌కు షాకిచ్చిన బీజేపీ నేతలు..

458

దిశ, గద్వాల : జోగులాంబ గద్వాల జిల్లాలో మంగళవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రులు నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాస్ గౌడ్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. సంగల పార్క్ ప్రారంభించిన మంత్రులు గద్వాల పట్టణంలోని కిష్టారెడ్డి బంగ్లా వద్దకు కాన్వాయ్ చేరుకోగానే ఒక్కసారిగా బీజేపీ నాయకులు అడ్డుపడి నినాదాలు చేశారు. బీజేపీ జెండాలు పట్టుకుని మంత్రి కేటీఆర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వెంటనే పోలీసులు బీజేపీ నాయకులను అరెస్టు చేసి కేటీఆర్ కాన్వాయ్‌ నుంచి దూరంగా తీసుకెళ్ళారు. ఒక్కసారిగా మంత్రి కాన్వాయ్ అడ్డుకోవడంతో స్థానికంగా కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది.

నా దుస్తులను ముట్టుకోకండి.. అఫ్ఘాన్ మహిళల నిరసన.. ఫొటోస్ వైరల్

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..