- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆసిస్ గెలుపుపై మహేష్ బాబు కామెంట్స్
<p>దిశ, సినిమా : పెద్దగా అంచనాలు లేకుండానే టీ20 ప్రపంచకప్ టోర్నీని ఆరంభించిన ఆస్ట్రేలియన్ టీమ్.. అందుకు తగ్గట్లే ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అక్కడి నుంచి ఎవరూ ఊహించని తీరున పుంజుకుని సెమీ ఫైనల్‌లో పాక్‌ను మట్టికరిపించిన కంగారూలు.. ఫైనల్‌లో కివీస్‌ను ఓడించి ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆసీస్ జట్టుపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. వారిది […]</p>

దిశ, సినిమా : పెద్దగా అంచనాలు లేకుండానే టీ20 ప్రపంచకప్ టోర్నీని ఆరంభించిన ఆస్ట్రేలియన్ టీమ్.. అందుకు తగ్గట్లే ఇంగ్లండ్ చేతిలో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అయితే అక్కడి నుంచి ఎవరూ ఊహించని తీరున పుంజుకుని సెమీ ఫైనల్‌లో పాక్‌ను మట్టికరిపించిన కంగారూలు.. ఫైనల్‌లో కివీస్‌ను ఓడించి ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న టీ20 ప్రపంచకప్ టైటిల్ సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఆసీస్ జట్టుపై ట్విట్టర్ వేదికగా ప్రశంసలు కురిపించాడు. వారిది చాలా బలమైన జట్టని పేర్కొన్న మహేశ్.. టీ20 విశ్వవిజేతగా నిలిచిన ఆ జట్టుకు అభినందనలు తెలిపాడు. ఇక డేవిడ్ వార్నర్ గురించి ప్రస్తావిస్తూ తనొక లెజెండరీ ప్లేయర్ అని కొనియాడాడు.
కాగా వార్నర్ గతంలో టిక్ టాక్ వీడియోలతో అందరినీ మెప్పించాడు. భారత్‌లో మీకు నచ్చిన స్టార్ హీరో ఎవరు? అని వార్నర్‌ను సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ప్రశ్నించగా.. ఏ మాత్రం ఆలోచించకుండా ‘నా ఫేవరెట్ హీరో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు’ అని జవాబిచ్చిన విషయం తెలెసిందే.
వార్నర్‌కు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్.. షోయబ్ అక్తర్ సీరియస్ కామెంట్స్
https://twitter.com/urstrulyMahesh/status/1460086606421905413?s=20






