మహేష్ అల్ట్రా స్టైలిష్ లుక్‌ అదుర్స్.. 

by  |
Mahesh
X

దిశ, సినిమా: సూపర్ స్టార్ మహేష్ బాబు వయస్సు కేవలం ఒక సంఖ్య అని మరోసారి తన అందంతో నిరూపించాడు. ఈ మేరకు తాజాగా అల్ట్రా స్టైలిష్ లుక్‌తో మహేష్ కనిపించగా నయా లుక్ అభిమానులను అమితంగా ఆకట్టుకుంటోంది. అలాగే ప్రస్తుతం ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మహేష్ బాబు సరికొత్త లుక్‌ను నిర్మాత బీఏ రాజు తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయడం విశేషం.

కాగా ఈ పిక్‌లో టోటల్ బ్లాక్ డ్రెస్, హెల్మెట్, బ్లాక్ కలర్ మొబైల్, బ్లాక్ షూస్ ధరించి బ్లాక్ కలర్ బైక్ పై కూర్చుని ఫోజులివ్వగా అచ్చం హాలీవుడ్ హీరోలా కనిపిస్తున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఈ కొత్త అవతారం ఏదైనా యాడ్ కోసమా? లేక సినిమా షూటింగ్‌లో భాగమా? అనేది అర్థం కాక నెటిజన్లు సోషల్ మీడియాలో చర్చ మొదలు పెట్టారు. ఇక పరశురామ్ దర్శకత్వంలో జీఎంబీ ఎంటర్‌టైన్మెంట్స్, మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ కలిసి నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మూవీ 2022, ఏప్రిల్ 1న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.

ఈ హీరోయిన్ ట్రీట్ చూస్తే మీ కంటికి కునుకుపట్టదు!

Next Story