- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
diabetic patients: డయాబెటిస్ పేషెంట్లకు అక్కడ నొప్పి ఎందుకు వస్తుంది..?
ప్రజెంట్ డేస్‌లో ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతోన్న విషయం తెలిసిందే.

diabetic patientsదిశ, వెబ్‌డెస్క్: ప్రజెంట్ డేస్‌లో ఎంతో మంది డయాబెటిస్ బారిన పడుతోన్న విషయం తెలిసిందే. దీంతో షుగర్ పేషెంట్లు ఏం తినాలన్నా సందేహాపడాల్సిన వస్తుంది. ఇన్స్యులిన్ హార్మోన్ స్థాయి తగ్గడం వల్ల కలిగే అనియంత్రిత మెటబాలిజం, రక్తంలో అధిక గ్లూకోజ్ స్థాయి వంటి లక్షణాలతో కూడిన ఒక రుగ్మత ఇది. డయాబెటిస్ అనేది వంశపారంపర్యంగా కూడా వచ్చే వ్యాధి అని నిపుణులు చెబుతూనే ఉంటారు.
డయాబెటిస్‌కు కారణాలు చూసినట్లైతే.. శరీరం ఇన్సులిన్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం, ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను తయారు చేయకపోవడం, ఉత్పత్తి చేసిన ఇన్సులిన్ సరిగ్గా పని చేయకపోవడం వంటివి. అతిమూత్రం (పాలీయూరియా), మందగించిన చూపు, కారణం లేకుండా బరువు తగ్గడం, దాహం ఎక్కువగా వేయడం (పాలీడిప్సియా)..
బద్ధకం డయాబెటిస్‌కు లక్షణాలు. ఫాస్టింగ్ బ్లడ్ గ్లూకోజ్ (షుగర్) స్థాయి 126 మిల్లీగ్రాములు ప్రతి డెసిలీటర్ (mg/dL) లేదా అంతకంటే ఎక్కువ ఉంటే డయాబెటిస్ వ్యాధి వచ్చిందని గుర్తించవచ్చని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ వస్తే జీవిత నాణ్యత తగ్గుతుంది. అయితే ఈ వ్యాధి ఉన్నవారికి భుజం నొప్పి తీవ్రంగా వస్తుందట. మరీ ఇలా ఎందుకు పెయిన్ వస్తుందో తాజాగా నిపుణులు వెల్లడించారు.
భుజం నొప్పి వస్తే ఏ వర్క్ చేయడానికి కూడా కష్టంగానే అనిపిస్తుంటుంది. వీరిలో దీర్ఘకాలికంగా ఈ వ్యాధి ఉంటుంది కాబట్టి పలు వ్యాధులు తలెత్తుతాయి. భుజాల దృఢత్వాన్ని కూడా తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. షోల్డర్ కదలికలపై కూడా ఎఫెక్ట్ చూపుతుందని, కండర ద్రవ్యరాశి కూడా తగ్గిపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
తద్వారా షోల్డర్ వీక్ అయిపోతుంది. కదలికపై కూడా తీవ్రంగా ఎఫెక్ట్ చూపుతుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో తరచూ భుజం నొప్పి ఉంటుంది. కాగా కండరాలు మందంగా మారకుండా ఉండటానికి వైద్యుల్ని సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. డయాబెటిస్ వల్ల భుజాల వద్ద కొల్లాజిన్ జిగటగా మారుతుంది. కదా కాగా కదలికలు కష్టంగా ఉంటాయి.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.
READ MORE ...
Pre Workout food: వర్కౌట్ ముందు ఇవి తినండి.. ఎనర్జీతో పాటు సంపూర్ణ ఆరోగ్యం?






