Pre Workout food: వర్కౌట్ ముందు ఇవి తినండి.. ఎనర్జీతో పాటు సంపూర్ణ ఆరోగ్యం?

by Kodari Anjali |

వర్కౌట్స్ (Workouts) చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి.

Pre Workout food: వర్కౌట్ ముందు ఇవి తినండి.. ఎనర్జీతో పాటు సంపూర్ణ ఆరోగ్యం?
X

దిశ, వెబ్‌డెస్క్: వర్కౌట్స్ (Workouts) చేయడం వల్ల శారీరకంగా, మానసికంగా అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ప్రతి రోజూ వ్యాయామం చేస్తే గుండె, ఊపిరితిత్తులు (lungs) బలంగా పనిచేస్తాయి. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. వర్కౌట్స్ ద్వారా కండరాలు బలంగా మారుతాయి. శరీరానికి ఉపశమనం కలుగడమే కాకుండా.. కీళ్లను గాయాల నుంచి రక్షిస్తుంది.

మధుమేహం, గుండె జబ్బులు (Heart diseases), స్ట్రోక్ వంటి వ్యాధుల ప్రమాదం తగ్గుతుంది. వ్యాయామం ద్వారా శరీరంలో కొవ్వు కరిగి, బరువు నిర్వహణలో ఉంటుంది. వ్యాయామం ద్వారా శరీరానికి శక్తి లభిస్తుంది. రోజంతా నిల్వగా ఉండటానికి మేలు చేస్తుంది. వీటితో పాటుగా మెరుగైన నిద్రకు దారితీస్తుంది. వ్యాయామం చేస్తే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది.

అంతేకాకుండా వ్యాయామం వల్ల మన మీద మనకు నమ్మకం ఏర్పడుతుంది. ఇది మన స్వీయభావనను కూడా పెంచుతుంది. వ్యాయామం చేస్తున్నప్పుడు శరీరంలో ఎండోర్ఫిన్ (Endorphin) అనే హార్మోన్ రిలీజ్ అయి.. ఇది మనల్ని హ్యాపీగా ఉంచేలా చేస్తుంది. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే మన శ్రేయస్సు పెరుగుతుందని.. ఇది మన జీవనశైలిని మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

అయితే కొంతమంది ఈ వర్కౌట్ వెయిట్ లాస్ అయ్యేందుకు చేస్తే.. మరికొంతమందెమో బరువు పెరిగేందుకు చేస్తారు. అలాగే కొందమంది రోజంతా బాడీ యాక్టివ్‌గా ఉండేందుకు, హెల్తీగా ఉండేందుకు చేస్తారు. మరీ సూపర్ ఎనర్జీ కోసం వర్కౌట్ ముందు ఈ పండు తినాలని తాజాగా నిపుణులు చెబుతున్నారు.

పొటాషియం, విటమిన్లు, ఫైబర్, యాంటీఆక్సిడెంట్లు (Antioxidants) దట్టంగా ఉండే బనానా వర్కౌట్ ముందు తింటే మేలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిలో ఉండే విటమిన్ B6, ఫైబర్ రక్తనాళాల్లో రక్త పీడనాన్ని నియంత్రించి కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. ఫలితంగా గుండెకు రక్త సరఫరా సాఫీగా సాగి ఎలాంటి గుండె సమస్యలు తలెత్తవు.

ఇలా గుండె ఆరోగ్యానికి బనానా సహకరిస్తుంది. అరటిపండుతో శారీరక ప్రయోజనాలే కాకుండా మానసిక ప్రయోజనాలు కూడా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అరటిపండులో ఉండే విటమిన్ బి6, ట్రిప్టోఫాన్ (Tryptophan)మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి.

బనానా తింటే జీర్ణక్రియ కూడా మెరుగుపడుతుంది. రక్తపోటును నియంత్రించడం, శక్తిని అందించడమే కాకుండా.. కండరాల పనితీరును మెరుగుపరుస్తాయి. రోగనిరోధక శక్తిని పెంచుతాయి. అరటిపండులో ఉండే సహజమైన చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. మలబద్ధకం, అజీర్ణం వంటి సమస్యలను తగ్గిస్తుంది. అరటిపండులో ఉండే మాంగనీస్ (Manganese)చర్మాన్ని కాంతివంతంగా, ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తుంది.

అంతేకాకుండా మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాగా వర్కౌట్స్ ముందు బనానా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అలాగే యాపిల్స్, చియా గింజలు (Chia seeds

) వాటర్‌లో నానబెట్టి తాగాలని చెబుతున్నారు. పీనట్ బటర్, ఓట్స్, చిలకడదుంపలు వంటివి తీసుకుంటే రోజంతా ఎనర్జీగా ఉండటమే కాకుండా సంపూర్ణ ఆరోగ్యం మీ సొంతమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.

Next Story