Viral Video: వీడు పిల్లాడు కాదు పిడుగు.. తల్లిదండ్రులకు ఇలాంటి వాడితో గుండెపోటు ఖాయం.. అల్లరి కాదు అంతకు మించి..

by Vennela |   (  Updated:2025-05-05 05:40:53  IST  )

Viral Video: ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నారు.

Viral Video: వీడు పిల్లాడు కాదు పిడుగు.. తల్లిదండ్రులకు ఇలాంటి వాడితో గుండెపోటు ఖాయం.. అల్లరి కాదు అంతకు మించి..
X

దిశ, వెబ్ డెస్క్ : Viral Video: ఈ మధ్యకాలంలో పిల్లలు చాలా ఫాస్ట్ గా పెరిగిపోతున్నారు. ఈ స్మార్ట్ ఫోన్ యుగంలో స్మార్ట్ ఫోన్ ఎలా వాడాలో వారికి పెద్దవాళ్లకన్నా ఎక్కువగా తెలుసు. వారికి అందుబాటులో ఉన్న ఎలక్ట్రానిక్స్ డివైసెస్ కారణంగా పిల్లలు తమ సహజమైన తెలివితేటలను మరింత పెంచుకొని ప్రమాదకరమైన పనులు సైతం చేసేస్తున్నారు.

తాజాగా అమెరికాలో ఓ ఘటన చోటుచేసుకుంది. ఓ 8 ఏళ్ల పిల్లవాడు తనకు బర్గర్ తినాలనిపించి తన నాలుగు సంవత్సరాల సోదరితో కలిసి కారు నడుపుకుంటూ దగ్గరలో ఉన్న బర్గర్ షాప్ వద్దకు వెళ్లి బర్గర్ కొనుగోలు చేసి తింటుంటే.. పోలీసులు గుర్తించి అసలు ఏం జరిగిందో విషయం బయటకు రాబట్టారు. 8 ఏళ్ల ఆ పిల్లవాడికి బర్గర్ తినాలనిపించిందని, వెంటనే తన తల్లిదండ్రులు నిద్రపోయిన సందర్భం చూసి కారు కేసు తీసుకొని తన చెల్లి తో సహా కారు ఎక్కి నడుపుకుంటూ బర్గర్ షాపుకు చేరుకొని బర్గర్ కొన్నట్లు ఆ పిల్లవాడు పోలీసులకు తెలిపారు.

నువ్వు ఇంత చిన్న పిల్లవాడివి కదా నీకు కారు నడపడం వచ్చా అంటే.. తాను యూట్యూబ్ చూసి కారు నడపడం నేర్చుకున్నాను అని పోలీసులకు చెప్పాడట. అది విన్న పోలీసులు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. అయితే ఆ పోలీసులు పిల్లవాడిని ఏమీ అనలేదు. తినగా తీసుకొని వెళ్లి వాళ్ళ తల్లిదండ్రులకు అప్పగించి జరిగింది చెప్పారు.

తల్లిదండ్రుల పైన గాని పిల్లవాడి పైన గాని ఎలాంటి చర్యలు పోలీసులు తీసుకోలేదు. దీనికి కారణం చెబుతూ పిల్లవాడికి తెలియక చేసిన తప్పు అని ఇప్పటినుంచి వాడికి కారు కీసు అందకుండా జాగ్రత్తగా దాచి పెట్టండి అని సలహా ఇచ్చారట. అసలు ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ అంత చిన్న పిల్లవాడు ఎలాంటి ప్రమాదం జరగకుండా కారు ఎలా డ్రైవ్ చేశాడని నెటిజెన్లు ఆశ్చర్యపోతున్నారు. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ గా మారింది.

Read More..

Ghee : షుగర్ పేషంట్స్ నెయ్యి తినవచ్చా? వైద్యులు సలహా ఏమిటంటే?

AI Kitchens : వంటగదుల్లోకి AI.. భవిష్యత్ అంతా ఈ స్మార్ట్ కిచెన్‌లదేనా..?



Next Story