AI Kitchens : వంటగదుల్లోకి AI.. భవిష్యత్ అంతా ఈ స్మార్ట్ కిచెన్‌లదేనా..?

by Javid Pasha |   (  Updated:2025-05-05 05:26:05  IST  )

AI Kitchens : వంటగదుల్లోకి AI.. భవిష్యత్ అంతా ఈ స్మార్ట్ కిచెన్‌లదేనా..?

AI Kitchens : వంటగదుల్లోకి AI.. భవిష్యత్ అంతా ఈ స్మార్ట్ కిచెన్‌లదేనా..?
X

దిశ, ఫీచర్స్ : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial intelligence) టెక్నాలజీ ఎన్ని అద్భుతాలు చేస్తున్నదో తెలిసిందే. ప్రస్తుతం హ్యూమనాయిడ్ రోబోట్స్ అయితే మానవులకు మరింత సౌకర్యాన్ని అందిస్తున్నాయి. కష్టతరమైన అనేక పనులను సులభతరం చేస్తున్నాయి. ఏఐ సాంకేతికత(AI technology) అనేక పనుల్లో సహాయపడుతోంది. అయితే ప్రస్తుతం ఇది వంటింటిలోకి సైతం ప్రవేశించనుందని నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్ అంతా ఏఐ ఆధారిత స్మార్ట్ కిచెన్లదేనని పేర్కొంటున్నారు. అదెలా సాధ్యమో ఇప్పుడు చూద్దాం.

నివాసిత గృహాలన్నీ ప్రస్తుతం స్మార్ట్ టీవీలు, కనెక్టెడ్ ఏసీలతో, కంప్యూటర్లతో, స్మార్ట్‌ఫోన్లతో ఆధునిక హంగులను సంతరించుకుంటున్నాయి. అయితే భారతీయ వంటగదుల్లోకి మాత్రం ఇంకా పూర్తిస్థాయి టెక్నాలజీ ప్రవేశించలేదనే చెప్పాలి. ఈ పరిస్థితిని మార్చడానికే వంటగదల్లో సైతం ఏఐ టెక్నాలజీని ప్రవేశపెట్టే ప్రయత్నం చేస్తోంది బియాండ్ అప్లయెన్సెస్ (Beyond Appliances) అనే స్టార్టప్. ఇందుకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కాగా ఇది సాధారణ ఇండియన్ కిచెన్లను (ordinary Indian kitchens)ను సైతం స్మార్ట్ ఎకో సిస్టమ్స్‌గా మార్చే లక్ష్యంతో పనిచేస్తోంది. వంటగదుల్లో వినియోగించుకునే సాంకేతికతను ఉత్పత్తి చేస్తోంది.

ఏయే ఉత్పత్తులు

మోడ్రన్ టెక్నాలజీని వంటగదుల్లో సైతం వినియోగించడానికి బియాండ్ అప్లయెన్సెస్ సంస్థ ఇప్పటికే ఆండ్రాయిడ్ టచ్ స్క్రీన్, డాల్బీ సౌండ్ వంటి వంటకాల మార్గదర్శనంతో (Chimneys with cooking instructions)కూడిన చిమ్నీలు, ప్రెజర్ కుక్కర్ విజిల్స్‌ను గుర్తించి ఆటేమోటిక్‌గా ఆగిపోయే స్టవ్‌లను ఉత్పత్తి చేస్తోంది. వీటికి ఏఐ ఆధారిత సాంకేతికతను అప్లై చేయడంవల్ల మరింత సౌలభ్యాన్ని, వేగాన్ని, సౌకర్యాన్ని పెంచుతాయని టెక్ నిపుణులు పేర్కొంటున్నారు. మెట్రో నగరాల నుంచి టైర్ - 3 పట్టణాల వరకు వీటికి డిమాండ్ పెరుగుతోంది.

ఆండ్రాయిడ్ - పవర్డ్ స్మార్ట్ చిమ్నీ

ఆండ్రాయిడ్ - పవర్డ్ స్మార్ట్ చిమ్నీ(Smart Chimney) అనేది 7- ఇంచ్ టచ్ స్క్రీన్ డిస్‌ప్లేతో వస్తుంది. కిచెన్ మేనేజ్ మెంట్‌సిస్టమ్‌గా పనిచేస్తుంది. ఇందులో 3D సక్షన్ మెకానిజం, బాఫిల్ ఫిల్టర్లు, ఆటో - క్లీన్ ఫీచర్, డాల్బీ డిజిటల్ సౌండ్ సిస్టమ్, షెఫ్ - డిజైన్ చేసిన రెసిపీలతో కూడిన ఇన్ఫోటైన్ మెంట్ స్క్రీన్ ఉన్నాయి. ఇది ఓటీటీ యాప్‌లు, మ్యూజిక్, రిమైండర్స్, అలాగే Zepto, Blinkit వంటి యాప్‌ల ద్వారా కూరగాయల లిస్టులను సృష్టించే సౌకర్యాన్ని అందిస్తుంది. ఏఐ - ఆధారిత ఫీచర్లు లైవ్ కుకింగ్ అసిస్టెన్స్‌ను అందిస్తాయి. ఇవి వంట ప్రక్రియను పర్యవేక్షిస్తూ సరైన ఫలితాలకోసం సూచనలు చేస్తాయి.

స్మార్ట్ హాబ్స్ (స్టవ్‌లు)

స్మార్ట్ హాబ్స్(smart hobs) స్టవ్‌లలో విజిల్ కౌంటర్, డిజిటల్ టైమర్, ఫ్లేమ్ ఫఎయిల్యూర్ డిటెక్షన్ (FFD) వంటి మోడ్రన్ ఫీచర్లు ఉంటాయి. ఇక విజిల్ కౌంటర్ అనేది ఏఐ టెక్నాలజీని ఉపయోగించి వివిధ ప్రెజర్ కుక్కర్లు, అలాగే ఆహార పరిణామాలకు అనుగుణంగా విజిల్స్‌ను గుర్తించి, సరైన సమయంలో స్టవ్‌ను ఆటోమేటిక్‌గా ఆపివేస్తుంది. అట్లనే ఎఫ్‌డీడీ (FFD) ఫీచర్ పాలు పొయ్యిమీద పెట్టి మర్చిపోయినప్పుడు అవిపొంగిపోయి స్టవ్‌లో మంట ఆరిపోతే గ్యాస్ లీకేజీని నిరోధించడం ద్వారా భద్రతను పెంచుతుంది.

ప్రయోజనాలు ఇవే..

స్మార్ట్ కిచెన్లలో ఏఐ ఆధారిత సాంకేతికను వినియోగించడంపై ప్రజలు ఆసక్తిగా ఉంటున్నారు. అయితే ప్రస్తుతం వంటగదుల్లోకి అవసరమైన టెక్నాలజీ అంతగా అందుబాటులో లేదు. కానీ భవిష్యత్తులో ఇది విస్తరిస్తుంది. కిచెన్లలో గోడలకు, స్టౌలలో, అల్మారాలలో అమర్చగలిగే ఏఐ ఆధారిత పరికరాలు వస్తాయి. ఇవి భోజనాన్ని ప్లాన్ చేయడం, ప్రిపేర్ చేయడం, సలహాలు ఇవ్వడం, కిరాణా సామగ్రిని ఆర్డర్ చేయడం, వంటగదిలో గాలిని శుద్ధి చేయడం వంటి అనేక పనుల్లో సహాయపడతాయని నిపుణులు పేర్కొంటున్నారు.

Read More..

నడమంత్రపు సిరితో ఇలా కూడా మారుతారా? ఊహించిన దానికంటే ఎక్కువే.. మా బంధువుల కథే..

Next Story