- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నడమంత్రపు సిరితో ఇలా కూడా మారుతారా? ఊహించిన దానికంటే ఎక్కువే.. మా బంధువుల కథే..
‘‘నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది’’ అనే సామెతను వినే ఉంటాం కదా. ఇది పుట్టుకతో కాకుండా మధ్యలో సిరిసంపదలు పొందిన మనిషి ప్రతికూల స్వభావం గురించి చెప్తుంది. ఇలాంటి

దిశ, ఫీచర్స్ : ‘‘నడమంత్రపు సిరి నరం మీద పుండు లాంటిది’’ అనే సామెతను వినే ఉంటాం కదా. ఇది పుట్టుకతో కాకుండా మధ్యలో సిరిసంపదలు పొందిన మనిషి ప్రతికూల స్వభావం గురించి చెప్తుంది. ఇలాంటి వ్యక్తులు పక్కనోళ్లకు సాయం చేసేది పోయి హేళన చేస్తారని, డబ్బు లేదని జోకులు వేసుకుంటారని కూడా అనుకుంటారు. కానీ తాజా అధ్యయనం మాత్రం ఇందుకు విరుద్ధమైన ఫలితాలతో ముందుకొచ్చింది. ఇంతకు ముందు జీవితంలో ఆర్థికంగా బాగాలేని వారు మధ్యలో సంపదను పొందితే సామాజిక సేవా కార్యక్రమాలు చేపడుతారని తెలిపింది. తనలాంటి పరిస్థితి ఇతరులకు ఉండకూడదనే ఉద్దేశంతో ఇలా చేస్తారని వివరించింది.
బర్మింగ్‌హామ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన గ్లోబల్ అధ్యయనం ఫలితం నిజంగానే ఆశ్యర్చపరుస్తుంది. 76 దేశాలలో 80,000 మంది పైగా పాల్గొన్నవారి డేటాను విశ్లేషించిన స్టడీ.. సంపద ఉన్న వ్యక్తులు సమాజానికి సాయం చేసే అవకాశం కొంత ఎక్కువగా ఉందని గుర్తించింది. ఈ అధ్యయనం ప్రకారం ఆర్థిక స్థిరత్వం ఉన్నవారు దానం చేయడం, స్వచ్ఛంద సేవలు చేయడం, ఇతరులకు సహాయం చేయడం వంటి కార్యకలాపాలలో ఎక్కువగా పాల్గొంటారని... ముఖ్యంగా ఆర్థిక కష్టాలను అనుభవించిన వ్యక్తులు, ఆర్థిక స్థిరత్వం సాధించిన తర్వాత, ఇతరుల పట్ల ఎక్కువ సానుభూతిని చూపిస్తారని తెలిపింది.
అయితే ఈ అధ్యయనం మరో అంశాన్ని కూడా వెల్లడించింది. సంపన్నులు ఇతరులపై తక్కువ విశ్వాసం కలిగి ఉంటారని.. సమాజం క్రమశిక్షణతో లేదని అనుకుంటారని వివరించింది. ప్రపంచవ్యాప్తంగా దేశాల ఆర్థిక స్థాయిలు, సాంస్కృతిక తేడాలతో సంబంధం లేకుండా ఈ నమ్మకం కొనసాగుతుందని చెప్పింది. ఇక మధ్యలో ఆర్థికంగా బలంగా మారినవారు నీతివంతులుగా మారినా మారకపోయినా.. వారిలోపల సానుభూతి, దయ మాత్రం పెరుగుతాయని నివేదించింది. సామాజిక బాధ్యతను పెంచుకుందని సూచించింది.
Read More..






