- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Valentine's Day Special : ట్రూ లవ్ లేదు మామ..
ప్రేమలో కోపతాపాలు కామన్. కానీ ఈ తరం ప్రేమలో స్వార్థం, రివేంజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఒక్క చిన్న గొడవ జరిగితే చాలు ఎప్పుడు వదిలేద్దామా అని వెయిట్ చేస్తున్న రోజులువి.

దిశ, ఫీచర్స్ : ప్రేమ.. ఎలా మొదలు పెట్టాలి.. ఎలా ఎండ్ చేయాలి. ఎంత గొప్పగా విన్నానని చెప్పాలి.. ఎంత నీచం చూస్తున్నానని చెప్పాలి.. లవ్.. ప్యార్.. ఇష్క్.. కాదల్.. ఒకప్పుడు ఈ పదాలను వింటుంటే మనసంతా సంతోషంతో నిండిపోయేది.. ఒక్కో ప్రేమ కథ వింటే గూస్ బంప్స్ వచ్చేవి.. ప్రేమను నిలబెట్టుకునేందుకు వారి త్యాగాలు విని కళ్లు చెమర్చేవి.. ప్రేమ అంత గొప్పదా అనిపించేది.. కానీ ఇప్పుడు లాగి చెంప మీద వేయాలనిపిస్తుంది. ప్రేమ నిజంగా గొప్పదే.. కానీ ప్రేమ అనే పేరు వాడుకుని.. ఈ జనరేషన్ చేస్తున్న తప్పుడు పనులు.. ఆ పదానికి అంటిస్తున్న కళంకం చూస్తుంటే.. ఒళ్లు మండుతుంది. సరే ఓ సినిమాలో సుకుమార్ గారు చూపించినట్లుగా ఇదేదో ఇన్‌ఫాక్చుయేషన్‌ను లవ్ అనుకుంటున్నారా అంటే అదీ కాదు. హండ్రెడ్ పర్సెంట్ తెలిసే.. మనస్పూర్తిగానే.. ప్రేమ అనే పేరుతో మనషుల మనసులను వాడేసుకుంటనున్నారు. సారీ.. సారీ.. మనుషుల శరీరాలను వాడుకుంటున్నారు.. మనసులతో ఆడేసుకుంటున్నారు.
గంజాయి వనంలో తులసి మొక్క మాదిరిగా వెయ్యికో ట్రూ లవ్ ఉంటుంది తప్పితే.. అన్నీ ఆడుకునేవే.. వాడుకునేవే. ఓ ఆఫీసులో కలుస్తరు.. ప్రేమ అంటరు.. లివ్ ఇన్ రిలేషన్‌షిప్ అంటరు.. కొన్నాళ్లకు మోజు తీరాక.. బోర్ కొట్టేశాక.. వీళ్ల కన్నా రిచ్, బ్యూటిఫుల్, బెట్టర్ స్టేటస్ కనిపిస్తే.. చేసిన వాగ్ధానాలు, షేర్ చేసుకున్న జ్ఞాపకాలన్ని గంగలో కలిపేస్తరు. హమ్మయ్యా.. ఎలాగోలా బయటపడ్డామనుకుని.. కొత్త బ్యాచ్‌ను పట్టేస్తరు. వీరిది మనీ ట్రాన్‌జాక్షనల్ బేస్డ్ లవ్ అన్నమాట. ఎవరు ఎక్కువ ఖర్చు పెడితే వాళ్లతో ప్రేమలో పడుతరు. గతం గత: అని ఈజీగా మూవ్ ఆన్ అయిపోతరు. ఈ రోజుల్లో ఇదంతా కామన్ అయిపోయింది. ఇంకొందరు అయితే మరీ దారుణం.. ప్రేమ అంటేనే పడక సుఖం.. అదే లేనప్పుడు.. నువ్వు ఎందుకనే జాతిరత్నాలు ఉన్నారు. వీళ్లు ఇంకో టైపు అన్నమాట. ఆధునిక ప్రేమలో కన్వీనియన్స్, వాలిడేషన్, సెల్ఫ్ ప్రొటెక్షన్‌కు ప్రాధాన్యత ఇవ్వడం వల్ల డెప్త్, ఎఫర్ట్, రిస్క్ తగ్గిపోతున్నాయి. అలాంటప్పుడు దీనికి ప్రేమ అనే పేరు ఎందుకు పెట్టడం? స్వార్థమనే అనొచ్చుగా?
స్టేటస్ పెట్టకపోతే లవ్ లేనట్టే?
ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్‌లో ఫాలోవర్స్‌ను పెంచుకునేందుకు పర్ఫెక్ట్ కపుల్ రీల్స్ చేయడం కామన్. వారు రియల్ లైఫ్‌లో అంత హ్యాపీగా లేకపోయినా రీల్ కోసం నటిస్తారు. కానీ ఈ పర్ఫెక్ట్ వీడియోలు చూసిన జనాలు నా పార్టనర్, నా లవర్ కూడా అలాగే ఉండాలని అనుకుంటారు. ఏదైనా స్పెషల్ డేకు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టకపోయినా.. వాట్సాప్‌లో స్టేటస్ లేకపోయినా.. తమకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని ఫీల్ అయిపోతుంటరు. ట్రస్ట్ ఇష్యూస్‌తో బ్రేకప్ చెప్పేస్తరు. నువ్వేంది బొక్కా.. డేటింగ్ యాప్స్ ఓపెన్ చేస్తే నంబర్ ఆఫ్ మ్యాచెస్ ఉంటాయని.. వారం రోజల్లో నీ కన్నా మంచి పార్టనర్‌ను పట్టేస్తామని సవాల్ విసురుతారు.
కమిట్‌మెంట్ భయం వెంటాడుతుందా?
ఒకప్పుడు ప్రేమించేది పెళ్లి చేసుకునేందుకే.. కానీ ఇప్పుడు టైం పాస్‌కు ప్రేమిస్తున్నారు. ముఖ్యంగా ఈ రోజుల్లో కమిట్‌మెంట్ భయం ఎక్కువైపోయింది. కెరీర్, ఫినాన్షియల్ స్టెబిలిటీ, మెంటల్ హెల్త్‌కు ప్రాధాన్యం ఇస్తూ.. ప్రేమించిన వారికి స్టిక్ ఆన్ అయి ఉండలేకపోతున్నారు. ఆర్థిక ఒత్తిళ్లు అంటే లోన్స్, జాబ్ ఉంటుందో ఊడుతుందో తెలియని పరిస్థితిని బేరీజు వేసుకుని.. లాంగ్ టర్మ్ రిలేషన్స్‌కు ఆందోళన చెందుతున్నారు. ఆన్‌లైన్ మాట్లాడటాన్ని, రొమాంటిక్ చాట్ చేసుకోవడాన్ని, న్యూడ్ వీడియో కాల్స్‌కు కూడా వెనుకాడని ఈ తరం ప్రేమికులు.. ఒక్కోసారి ఎక్స్ వై జెడ్ అయిపోయినా.. కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. టూ మచ్ లైట్‌గా తీసేసుకుంటున్నరు. ఒక్కోసారి ఇద్దరు అలాగే ఉండొచ్చు.. అలా అయితే ప్రాబ్లమ్ లేదు. కానీ ఒకరు సిన్సియర్‌గా ఉండి మరొకరు టైం పాస్ చేస్తేనే ఆత్మహత్యలు జరిగేది.. పెళ్లి చేసుకోమంటూ ఇంటి ముందు ధర్నాలు, నిరసనలు చేపట్టేది.
లవ్ అంటే రివేంజ్ అనుకుంటున్నారా?
ఓ కాలేజీలో పిల్ల బచ్చాగాళ్లు ఉన్నారనుకుందాం. వీళ్లకు లవ్ ఏందో తెల్వదు. కానీ లవర్ ఉంటే బాగుండాలనుకుంటరు. కావాల్సినది అందితే ఓకే లేదంటే ఇన్ని రోజులు ముద్దులు, కౌగిలింతలు ఇస్తూ తిరిగిన లవర్‌ను పక్కన పెట్టేసి.. తన ముందే మరొకరిని ముద్దాడుతరు. ఈ జనరేషన్ భాషలో చెప్పాలంటే.. మానిప్యులేషన్ అనేది లవ్ మెథడ్.. భావోద్వేగాలతో ఆడుకోవడమనేది లవ్ కల్చర్. మొత్తానికి నేను చెప్పింది వినలేదు అంటే రివేంజ్ నెక్స్ట్ ప్లాన్. ఇదేనా ప్రేమంటే..? చిన్న విషయాలకు బ్రేకప్ చెప్పుకోవడాన్ని ప్యార్ అనరు.. ప్యార్‌కు పంచనామా జేసుడు అంటరు. ఫైనల్‌గా ఇన్‌స్టంట్ గ్రాటిఫికేషన్ కల్చర్ వల్ల ప్రేమలో ఓపిక, ఎఫర్ట్ తగ్గిపోతున్నాయి. రిలేషన్ షిప్‌లో నమ్మకం అనేది తగ్గిపోతుంది.
తొక్కలే ఇన్ని తలనొప్పులు నాకెందుకు?
స్క్రీన్ లైఫ్ ఎక్కువ అయిందనేది అందరూ యాక్సెప్ట్ చేయాల్సిన నిజం. దీనివల్ల రియల్ కనెక్షన్స్ తగ్గిపోతున్నాయి. ఫోన్ డిస్ట్రాక్ట్ చేస్తుండటం వల్ల దంపతులు కూడా విడిపోవాల్సి వస్తుంది. ఇక మూడు ముళ్లు పడని ప్రేమికుల సంగతి సరేసరి. ఒక జంటలో ఒక్కరు ప్రాబ్లమెటిక్‌గా ఉంటే ఇంకొకరి మెంటల్ హెల్త్ దెబ్బతింటుంది. ప్రేమ అనేది ప్రశాంతతకు బదులుగా ఒత్తిడిని ఇస్తుంది.. సంతోషాన్ని పంచేదిపోయి టాక్సిక్‌గా మారుతుంది. దీంతో ఈ తలనొప్పులు నాకెందుకురా నాయనా అనుకుని.. ఒంటరిగా ఉండేందుకే ఇంట్రెస్ట్ చూపేవారు కూడా పెరిగిపోతున్నారు.






