- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సోషల్ మీడియా పట్ల GenZలో మారుతున్న వైఖరి.. మెంటల్ పీప్ ముఖ్యమంటున్న యువత!
దక్షిణ భారతదేశంలోని కాలేజీ విద్యార్థులలో 36.9% మంది సోషల్ మీడియా అడిక్షన్‌తో బాధపడుతున్నారు. ఇది నిద్రా భంగం, కోపం, ఆందోళన వంటివి పెరగడానికి దారితీస్తున్నది

దిశ, ఫీచర్స్ : ఇది సోషల్ మీడియా యుగం. కమ్యూనికేషన్ కోసమో, ఇన్ఫర్మేషన్ కోసమో, ప్రపంచంతో కనెక్టిటివీ కోసమో ప్రతి ఒక్కరూ సోషల్ మీడియాను వినియోగిస్తున్నారు. ముఖ్యంగా వివిధ సోషల్ మీడియా వేదికలను ఉపయోగిస్తున్న వారిలో యువతరమే ఎక్కువగా ఉంటూ వస్తోంది. అయితే ఇటీవల GenZ వైఖరిలో, ముఖ్యంగా భారత దేశంలోని యువతలో కొత్త మార్పు కనిపిస్తోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఏంటంటే.. గతంతో పోలిస్తే వీరు సోషల్ మీడియాలో నిమగ్నమయ్యే సమయాన్ని తగ్గిస్తున్నారు. ముఖ్యంగా GenZ సోషల్ మీడియా నుంచి దూరంగా జరుగుతుండటం ఇటీవల ఒక ట్రెండ్‌గా మారింది.
స్వతంత్రత, నియంత్రణ
సోషల్ మీడియాకు దూరంగా ఉండటమంటే ఇక్కడ దానిని పూర్తిగా వినియోగించకపోవడం మాత్రం కాదు. కానీ పరిమితులు పాటిస్తున్నట్లు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. అయితే ఈ సడలింపు కేవలం డిస్‌కనెక్ట్ కాదు, మానసిక శాంతి, స్వతంత్రత, నియంత్రణను తిరిగి సాధించడం కోసమని యువతరం అభిప్రాయపడుతోంది. అధ్యయనాల ప్రకారం.. దక్షిణ భారతదేశంలోని కాలేజీ విద్యార్థులలో 36.9% మంది సోషల్ మీడియా అడిక్షన్‌తో బాధపడుతున్నారు. ఇది నిద్ర భంగం(sleep disturbance), కోపం పెరగడం(Increasing anger) వంటి సమస్యలకు దారితీస్తున్నదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అలాగే నేషనల్ మెంటల్ హెల్త్ సర్వే ప్రకారం.. ప్రతీ ఏడుగురు యువతలో ఒకరు మానసిక సమస్యలను ఎదుర్కొ్ంటుండగా.. సోషల్ మీడియా దీనికి మరింత ఆజ్యం పోస్తోంది. ఇలాంటి పరిస్థితులే భారత యువతలో సోషల్ మీడియాపట్ల మారతున్న వైఖరికి కారణం అవుతున్నాయని నిపుణులు అంటున్నారు.
ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ప్రాబ్లమ్స్
అంతేకాకుండా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు లైక్స్, కామెంట్ల ద్వారా డొపమైన్ రివార్డ్‌లు ఇచ్చి వ్యక్తుల అటెన్షన్‌ను క్యాప్చర్ చేస్తాయిజ ఇది హాబిట్ ఫార్మేషన్‌కు దారితీసి ఆందోళన, డిప్రెషన్, స్ట్రెస్‌ను పెంచుతుంది. దీంతోపాటు సామాజిక అతి అంచనాలు, జడ్జ్‌మెంట్ ఫియర్, డిజిటల్ బర్న్ అవుట్, ప్రైవసీ ఇష్యూస్ కూడా యువతను ఆలోచింపజేస్తున్నాయి. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO), సోషల్ కంపారిజన్, సైబర్ బుల్లింగ్ వంటివి పలువురిలో మెంటల్ హెల్త్‌ను దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ భారత యువతలో సోషల్ మీడియా పట్ల జాగ్రత్తగా ఉండాలని, లిమిటెడ్‌గా వాడాలని, అవసరమైతే దూరంగా ఉండాలనే వైఖరి పెరగడానికి దారితీస్తున్నాయి. ఈ విధమైన మైక్రో రొటీన్స్ యువతలో వాకింగ్, జర్నలింగ్, బ్రీతింగ్ వంటి అలవాట్లకు దగ్గర చేస్తూ ఆందోళన, ఒత్తిడిని తగ్గిస్తుందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా పరిమితమైన సోషల్ మీడియా వినియోగం వాల్యూస్ బేస్డ్ బిహేవియర్‌ను ప్రోత్సహిస్తాయని, నో స్క్రీన్ టైమ్ అవర్స్ స్కిల్స్ డెవలప్‌మెంట్‌కు సహాయపడతాయని కూడా పేర్కొంటున్నారు.
Read More..






