Gen Zs కంటే మిలెనియల్సే యవ్వనంగా కనిపిస్తుంటారు! ఎందుకో తెలుసా?

by Javid Pasha |   (  Updated:2026-01-14 09:16:34  IST  )

30 ఏండ్లలోపు యువత ఇటీవల 35-40 ఏండ్ల వ్యక్తుల్లా కనిపిస్తుండగా.. 35- 40 ఏండ్ల వయసుగల వారు 25-30 ఏండ్లలోపు యువతలా కనిపిస్తున్నారు.

Gen Zs కంటే మిలెనియల్సే యవ్వనంగా కనిపిస్తుంటారు! ఎందుకో తెలుసా?
X

దిశ, ఫీచర్స్ : మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేసే ఉంటారు బహుశా..! కొంతమంది వయసులో చిన్నవారైనప్పటికీ చూడ్డానికి మాత్రం అధిక వయసు గలవారిగా కనిపిస్తుంటారు. మరికొందరు ఏజ్ పరంగా పెద్దవారైనప్పటికీ చూడ్డానికి తక్కువ వయసు గలవారిగా, యవ్వనంగా కనిపిస్తుంటారు. ముఖ్యంగా 30 ఏండ్లలోపు యువత కూడా 35-40 ఏండ్ల వ్యక్తుల్లా కనిపిస్తుంటే.. 35- 40 ఏండ్ల వయసుగల మిలెనియల్స్(Millennials) ఏమో 25-30 ఏండ్లలోపు యువతలా కనిపిస్తుంటారు. ఎందుకిలా జరుగుతుంది? అనే సందేహాలు సైతం పలువురిని వెంటాడుతుంటాయి? అయితే నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

మిలెనియల్స్ యవ్వన రహస్యం

చిన్న ఏజ్ కలిగిన యువతీ యువకులు పెద్ద వయసు గల వారిలా, పెద్ద ఏజ్ కలిగిన మిలెనియల్స్ జెన్‌జీ(Gen Zs)ల మాదిరి కనిపించే ధోరణి ఒకప్పుడు తక్కువగా ఉండేది. కానీ ఇటీవల ఎక్కువగా కనిపిస్తున్నది. ముఖ్యంగా 1985–1995 మధ్య జన్మించిన మిలెనియల్స్.. తమకంటే 10–20 సంవత్సరాలు చిన్నవారైన జెన్ Z వారి కంటే చాలా యవ్వనంగా కనిపిస్తున్నారు. ఇది చూసిన పలువురు మీరు ఏం తింటారు? ఏ విధమైన జీవన శైలిని అనుసరిస్తుంటారు? అని మిలెనియల్స్‌ని అడుగుతుంటారు. మరికొందరు అదేదో అదృష్టమని కూడా చెబుతుంటారు. కానీ అదంతా ఒట్టిదే అంటున్నారు నిపుణులు. యవ్వనంగా కనిపించడమనేది జన్యువులు, అదృష్టం లేదా ‘మంచి కాలాలు’ వల్ల ఏమాత్రం కాదు. కాకపోతే మిలెనియల్స్ పూర్తిగా డిజిటల్ జీవితం రాకముందు పుట్టి పెరగడం, వారు నిరంతరం స్క్రీన్లు, ఫిల్టర్లు, స్టోరీలు, అల్గారిథమ్‌లు లేకుండా పెరగడం అసలైన యవ్వన రహస్యమని అంటున్నారు.

డిజిటల్ ఎఫెక్ట్ లేకపోవడం..

మిలెనియల్స్‌లో అత్యధికమంది డిజిటల్ లైఫ్‌‌ను అనుభవించకుండా, సహజ సిద్ధమైన ప్రకృతి వాతారణాల్లో పెరగడం, కల్తీ లేని ఆహారపు అలవాట్లతో పెరగడం, కల్మషం లేని మనస్తత్వాలతో పెరగడం, సంతోషంగా గడపడం వంటివి వారి నరాల వ్యవస్థను ఉత్తేజ పరిచేది. అంతేకాకుండా మిలెనియల్స్‌ స్వార్థం కోసమో, అవసరం కోసమో సంబంధాలు, సంభాషణలు కొనసాగించరు. చాలా వరకు నిజమైన కన్వర్జేషన్స్, ఇంటర్నల్ హ్యాపీనెస్, సానుకూల ధోరణులు కలిగి ఉండేవారు చాలామంది కనిపిస్తుంటారు. అంతేకాకుండా వీరు సమయస్ఫూర్తి వ్యవహరించడం, వర్తమానంలో జీవించడం ద్వారా ప్రగాఢమైన ఆత్మ విశ్వాసంతో అభివృద్ధి చెందిన తరం కావడం కూడా యవ్వనంగా ఉండటానికి మరో ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. అందం, ఆస్తులు, హోదా వంటి విషయాల్లో నిరంతర పోలికలు లేకపోవడం, తక్కువ ఆందోళన, తక్కువ ఒత్తిడి (Invisible pressure) వంటివి 1985–1995 మిలెనియల్స్ శరీరంలో పేరుకుపోలేదు. ఈ విధమైన పరిస్థితులే దీర్ఘకాలంలో వారి శారీరక, మానసిక ఆరోగ్యంపై, జెన్‌జీలతో పోలిస్తే చాలా తక్కువ హాని కలిగించాయి. ఆరోగ్యం, ఆనందం కలగలిసి శరీరంలోని కణాల స్థాయిలో జీవితకాలాన్ని పొడిగించడం ద్వారా వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేశాయి.

జెన్ Zలో ఏజింగ్‌ లక్షణాలకు కారణాలు

ఇక జెన్‌జీలలో ఆలోచనలు, ఆహారపు అలవాట్లు, జీవన విధానం 1985–1995 మిలెనియల్స్‌తో పోలిస్తే పూర్తి భిన్నంగా ఉంటోంది. ప్రధానంగా పెరుగుతున్న డిజిటల్ ఒత్తిడి, సోషల్ మీడియా పోలికలు, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ (FOMO), క్రానిక్ స్ట్రెస్ వల్ల వేగంగా 2000 సంవత్సరం తర్వాత జన్మించిన యువతరాన్ని (Gen Zs) ఎక్కువగా ప్రభావితం చేస్తున్నాయి. వీరి శరీరం, మనసు నిరంతరం ‘పర్ఫెక్ట్’గా ఉండాలని, ఆప్టిమైజ్ చేయాలని ఒత్తిడి చేస్తుంది. అలాగే ఎక్స్‌ట్రీమ్ డైటింగ్, బయోహాకింగ్, ఫిల్టర్లు, ఫిల్లర్లు వంటివి వారిలో నిరంతర ఆందోళనను, ఒత్తిడిని పెంచుతూ వృద్ధాప్య లక్షణాలు త్వరగా పెరగడానికి కారణం అవుతున్నాయి. సహజ సిద్ధమైన ఆహారాలు కాకుండా అధిక చక్కెరలు కలిగిన, అధిక ఫ్యాట్ కలిగిన ఆహారాలు, జంక్ ఫుడ్స్ జంక్ ఫుడ్స్ వంటివి కూడా ‘ఏజింగ్’ లక్షణాలను మరింత పెంచుతున్నాయి. కానీ మిలెనియల్స్‌లో ఈ అలవాట్లు చాలా తక్కువ. వీరు ఇప్పటికీ 1990లలోని ఆహారపు అలవాట్లనే ఎక్కువగా అనుసరిస్తుంటారు. మితంగా తినడం, క్రమశిక్షణ కలిగి ఉండటం, శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వడం వంటివి నరాల వ్యవస్థపై(Nervous system condition) సానుకూల ప్రభావం చూపుతున్నాయి. తక్కువ స్థాయి అంతర్గత ఆందోళనలు, డిజిటల్ ఓవర్‌లోడ్ వంటి వాటికి గురికాకపోవడం మిలెనియల్స్‌లో శరీరం, ముఖం వంటివి యవ్వనంగా కనిపించడంలో కీ రోల్ పోషిస్తున్నాయి.

READ MORE ....

మే నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అట్రాక్టివ్ ఉంటారు..! రహస్యమేంటో బయటపెట్టిన నిపుణులు!!

Next Story