మే నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అట్రాక్టివ్ ఉంటారు..! రహస్యమేంటో బయటపెట్టిన నిపుణులు!!

by Javid Pasha |   (  Updated:2026-01-14 09:15:16  IST  )

21 నుంచి 23 సంవత్సరాలలోపు వయసుగల 5, 294 మహిళలపై జరిగిన ఒక అధ్యయనం.. మే నెలలో పుట్టిన వారు అట్రాక్టివ్ ఉంటారని వెల్లడించింది.

మే నెలలో పుట్టిన అమ్మాయిలు చాలా అట్రాక్టివ్ ఉంటారు..! రహస్యమేంటో బయటపెట్టిన నిపుణులు!!
X

దిశ, ఫీచర్స్ : ఫలానా అమ్మాయి ఎందుకో చాలా అట్రాక్ట్‌గా ఉందని మీరెప్పుడైనా భావించారా? మిగతా వారికంటే ఫలానా మహిళలో ఏదో ఆకర్షణ ఉందబ్బా అని ఎవరైనా పొగడటం విన్నారా? అయితే వారు దాదాపు మే నెలలో జన్మించిన వారై ఉంటారు! ఎందుకంటే ఈ నెలలో జన్మించిన మహిళలు వారి కలర్ నలుపైనా, తెలుపైనా హైట్ అండ్ వెయిట్(Height and weight) ఎలా ఉన్నా చూడ్డానికి మాత్రం.. మిగతా మహిళలతో పోల్చినప్పుడు ఆకర్షణీయంగా అనిపిస్తారని పోలండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ వ్రోక్లా నిర్వహించిన ఒక అధ్యయనం వెల్లడించింది. అందుకు గల కారణాలేమిటో ఇప్పుడు చూద్దాం.

అధ్యయనం జరిగిందిలా..

‘బోర్న్ టు బీ బ్యూటిఫుల్’ అనే స్టడీలో భాగంగా రీసెర్చర్స్ అత్యధికమంది ప్రజలు ఏ విధమైన మహిళల్ని అట్రాక్టివ్ గలవారిగా భావిస్తారో తెలుసుకునేందుకు ప్రయత్నించారు. ఇందులో భాగంగా 21 నుంచి 23 సంవత్సరాలలోపు వయసుగల 5, 294 మహిళల సోషల్ మీడియా ఫొటోలను సైతం అంచనా వేశారు. ప్రత్యక్షంగా, ఆన్‌లైన్ వేదికగా పరిశీలనలు జరిపారు. ఈ సందర్భంగా తేలిందేమిటంటే.. మిగతా వారితో పోలిస్తే.. వసంతకాలం(మే నెల)లో పుట్టిన మహిళలు, శరదృతువులో (సెప్టెంబర్, నవంబర్) పుట్టినవారికంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నట్లు రేటింగ్ పొందారు. ఇది ఆకర్షణను కొలిచే స్కేల్‌లో స్పష్టంగా కనిపించింది. మేలో పుట్టినవారి స్కోర్ 10.22గా ఉండగా, సెప్టెంబర్, అలాగే నవంబర్‌లో పుట్టినవారి అట్రాక్టివ్ రేటింగ్ 10.15 అండ్ 10.14గా ఉంది. అంటే మే నెలలో పుట్టినవారు అత్యంతక ఆకర్షణీయంగా ఉంటున్నారు.

ఎందుకని అలా..

మే నెలలో పుట్టిన మహిళలు/అమ్మాయిలు సెప్టెంబర్, నవంబర్ నెలల్లో పుట్టినవారికంటే ఎక్కుక ఆకర్షణీయంగా అనిపించడానికి ముఖ్య కారణం.. వారి పుట్టిన సీజన్‌తో ముడిపడిన ఆరోగ్య ప్రయోజనాలేనని అధ్యయనం పేర్కొన్నది. రీసెర్చర్స్ చెప్పినట్లుగా.. వసంతకాలం(మే)లో పుట్టినవారు సహజంగానే పోషకాహారం, చలి, వేడి, డీహైడ్రేషన్ వంటివి సీజనల్ కారకాల వల్ల మెరుగైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. ముఖ్యంగా ఫిబ్రవరి నుంచి మే మధ్య పుట్టిన శిశువులు జన్మించిన తర్వాత రెండు నెలల వరకు బాలింతల్లో ఇమ్యూనోగ్లోబులిన్స్ (ఇమ్యూనిటీ ప్రోటీన్లు) వల్ల రోగనిరోధకత బలంగా ఉంటుంది. ఇది శిశువుల్లో డిసీజ్ రిస్క్‌ను తగ్గిస్తుంది. దీని వల్ల వారు పెరిగే కొద్దీ కూడా దీర్ఘకాలంలో శారీరక ఆకర్షణ పెరుగుతుంది. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ వంటి నెలల్లో పుట్టినవారి కంటే కూడా మే నెలలో పుట్టిన వీరు చాలా తక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్‌ను ఎదుర్కొంటారు. అమెరికన్ మెడికల్ ఇన్ఫర్మాటిక్స్ అసోసియేషన్ 2015 స్టడీ కూడా మే నెల పుట్టినవారిలో 55 రకాల డిసీజ్‌ల రిస్క్ తక్కువగా ఉంటుందని నిర్ధారించింది. మొత్తానికి ఈ థియరీల వెనుక శాస్త్రీయ కారణాలు ఉన్నట్లు అనిపించినప్పటికీ పూర్తిగా యూనివర్సల్ మాత్రం కాదు. ఎందుకంటే ఆకర్షణ జన్యువులు, లైఫ్‌స్టైల్ వంటి ఇతర కారకాలపై కూడా ఆధారపడి ఉంటుంది. పైగా సదరు అధ్యయనాలు ముఖ్యంగా పోలిష్ మహిళల( Polish women)పై ఆధారపడినవి. ఇటీవల తరచుగా వైరల్ అవుతున్నాయి. లింక్

READ MORE ....

Gen Zs కంటే మిలెనియల్సే యవ్వనంగా కనిపిస్తుంటారు! ఎందుకో తెలుసా?

Next Story