- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దేశవ్యాప్తంగా వర్షాలపై వాతావరణశాఖ హెచ్చరిక.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
దేశవ్యాప్తంగా వర్షాలపై తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో 3,4 రోజులు నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత్ లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

దిశ, వెబ్ డెస్క్: దేశవ్యాప్తంగా వర్షాలపై తెలంగాణ వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. మరో 3,4 రోజులు నైరుతి రుతుపవనాలు చురుగ్గా ఉండే అవకాశం ఉందని తెలిపింది. వీటి ప్రభావంతో ఉత్తర, తూర్పు, ఈశాన్య భారత్ లో విస్తారంగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. పలు రాష్ట్రాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. గుజరాత్, మహారాష్ట్రలో అతిభారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉందని హెచ్చరించింది. అదే విధంగా జమ్ముకశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, లడఖ్ లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
కాబట్టి భారీ వర్షసూచన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్న సంగతి తెలిసిందే. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది మాత్రం వర్షాలు తక్కువగానే కురుస్తున్నాయి. అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం భారీ నుండి అతిభారీ వర్షాలు కురుస్తుండటంతో వరదలు రావడం, కొండచరియలు విరిగిపడటం లాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.ఈ నేపథ్యంలోనే మరో 3,4 రోజులు వర్షసూచన ఉండటంతో వాతావరణశాఖ ప్రజలను అప్రమత్తం చేస్తోంది.






