- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రిస్క్ వద్దు బాస్.. కంఫర్ట్‌జోనే బెటర్..! అమ్మాయిల్లో పెరుగుతున్న కొత్త ధోరణి
కంఫర్ట్ జోన్‌లో ఉండటమంటే.. ఒకప్పుడు సమానత్వ వ్యతిరేక ధోరణిగా భావించేవారు. కానీ నేటి అమ్మాయిలు దీనికి కొత్త నిర్వచనం చెబుతున్నారు!

దిశ, ఫీచర్స్ : అమ్మాయిలు ప్రతీ విషయంలో ముందుండాలని, పురుషులతో సమానంగా రాణించాలని చాలా మంది చెబుతుంటారు. స్త్రీ, పురుష సమానత్వ భావనకు ఇది నిదర్శనంగా పేర్కొంటారు. అమ్మాయిలంటే అబలలు, అందమైన వాళ్లు, సౌందర్యానికి ప్రతీకలు వంటి పొగడ్తలను, వర్ణనలను సైతం వ్యతిరేకిస్తుంటారు కొందరు ఫెమినిస్టులు. మహిళలు కేవలం గృహిణులుగానో, పురుషులపై ఆధారపడే వ్యక్తులుగానో ఉండాల్సిన అవసరం లేదని చెబుతుంటారు. ఇంట్లో అయినా వర్క్‌ప్లేస్‌లలో అయినా స్వతంత్రంగా ఉండాలని, నాయకత్వ లక్షణాలను అలవర్చుకోవాలని, ఆచరణలో పెట్టాలని, కంఫర్ట్‌జోన్ నుంచి బయటపడాలని సూచిస్తుంటారు. కానీ ఇటీవల చాలా మంది యువతులు ఈ ఒత్తిడిని ఇష్టపడకుండా, సాఫ్ట్ గర్ల్ ఎరా వైపు మొగ్గు చూపుతున్నారు. దీనినే ‘కంఫర్ట్ జోన్ ధోరణి’గా పేర్కొంటున్నారు.
డిపెండెన్సీనే ఇష్టమా?
ఇటీవల అమ్మాయిల్లో పెరుగుతున్న కొత్త ట్రెండ్ ప్రకారం.. చాలామంది అత్యధిక విషయాల్లో తాము స్వతంత్రంగా, నాయకత్వ ధోరణితో వ్యవహరించడంకంటే.. భాగస్వామిపై లేదా కుటుంబంపై లేదా టీమ్ లీడర్‌పై ఆధారపడటానికి ఇష్టపడుతున్నారు. “ఇది కేవలం ఆధారపడటం మాత్రమే కాకుండా, స్వీయ సంరక్షణ (self-care), మానసిక ఆరోగ్యం, స్లో లివింగ్‌కి కూడా ప్రాధాన్యత ఇవ్వడం’గా చూస్తున్నారు. అంతేకాకుండా తమకు నచ్చిన పరిస్థితుల్లో ‘అందమైన, నాజూకైన, ఆకర్షణీయమైన, సౌందర్యపరమైన’ వంటి ప్రశంసలను సైతం చాలామంది ఇష్టపడుతున్నారు. ఈ విధమైన పొగడ్తలను, వర్ణనలను ఆస్వాదిస్తూ ఆనందించే ధోరణి పెరుగుతోందని ‘సాఫ్ట్‌గర్ల్‌ఎరా’వంటి ధోరణులను విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. ఈ సాఫ్ట్ గర్ల్ ఎరా(Soft Girl Era) ధోరణికి చాలామంది మహిళలు అట్రాక్ట్ అవుతున్నారని, ముఖ్యంగా జీవితంలో కంఫర్ట్‌జోన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని పేర్కొంటున్నారు.
ఇలా ఉండటమే ఇష్టం!
కంఫర్ట్ జోన్‌లో ఉండటం, అత్యధిక విషయాల్లో పురుష భాగస్వామిపై ఆధారపడటమంటే ఒకప్పుడు స్త్రీ, పురుష సమానత్వ వ్యతిరేక ధోరణిగా కొందరు భావించేవారు. కానీ నేటి అమ్మాయిలు దీనికి కొత్త నిర్వచనం చెబుతున్నారని నిపుణులు అంటున్నారు. ఏంటంటే.. తామున్న పరిస్థితులు, వేదికలను బట్టి భాగస్వామి, కుటుంబం, బాస్‌లపై ఆధారపడటం రిస్క్‌లేనిదిగా భావిస్తున్నారు. అంతేకాకుండా సౌకర్యంగా ఉండటమనేది నేటి మహిళలు స్వీయ సంరక్షణలో భాగంగా, ఆత్మాభిమానంగా భావిస్తున్నారు. ఇది ఒకప్పుడు సమానత్వ వ్యతిరేకంగా కనిపించినా, నేటి అమ్మాయిలు దీన్ని తమ ఆత్మగౌరవం, మానసిక సంతుల్యతలో భాగంగా చూస్తున్నారు
సౌకర్యమే ముఖ్యం..
ఒక విధంగా చెప్పాలంటే ఈ ‘కంఫర్ట్ జోన్’ అనేది యువతులు స్లో లివింగ్, ఫెమినినిటీ అండ్ పీస్‌ఫుల్ లైఫ్‌కి ప్రయారిటీ ఇచ్చే కొత్త మార్గంగా భావిస్తున్నారు. 2023లో ప్రాంభమైన ‘సాఫ్ట్ గర్ల్ ఎరా ట్రెండ్’కు మించి ఇది విస్తరిస్తోందని, ఇటీవల మరింత ఎక్కువ ఆదరణ పొందుతోందని నిపుణులు చెబుతున్నారు. పైగా ఇది గర్ల్‌బాస్ కల్చర్(Hustle and Career Focus)ను తిరస్కరించి, సౌకర్యం, స్వస్థత, ఆనందం, వ్యక్తిగత సౌందర్యం వంటి వాటిని కూడా ప్రోత్సహిస్తున్నది. పురుషులతో పోలిస్తే మహిళలు అందమైన వాళ్లు, మృదు స్వభావులు, సౌందర్య ప్రియులు వంటి భావాలకు ఈ ట్రెండ్ ప్రయారిటీ ఇస్తున్నది. అయితే ఈ ధోరణి పూర్తిగా డిపెండెన్సీలోకి మారకుండా, సౌకర్యం, పర్సనల్ గ్రోత్ మధ్య బ్యాలెన్స్ ఉంచుకోవడం కూడా ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు. ఈ మార్పు అమ్మాయిల జీవితాల్లో నిజమైన సంతోషాన్ని తెస్తుందా? లేదా కేవలం తాత్కాలిక ఊరటా? అనేది కాలమే సమాధానం చెప్పాలి.






