నగర యువతలో పెరుగుతున్న లోన్లీనెస్.. చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు!

by Javid Pasha |   (  Updated:2026-03-29 15:30:20  IST  )

నగరాల్లో జీవితం ఎంత ఆకర్షణీయంగా కనిపించినా.. యువతలో ఒక రకమైన ఖాళీ భావన పెరుగుతోంది!

నగర యువతలో పెరుగుతున్న లోన్లీనెస్.. చుట్టూ జనం ఉన్నా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు!
X

దిశ, ఫీచర్స్ : సిటీలో యూత్ మస్తు టాలెంటెడ్ అనుకుంటారు కొందరు. నచ్చిన ఉద్యోగాలు చేస్తూ సంతోషంగా ఉంటున్నారని, లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారని భావిస్తారు మరికొందరు. కానీ ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. మరోవైపు ఎవరికీ చెప్పుకోలేని మానసిక సంఘర్షణలు సైతం నగర యువతలో పెరిగిపోతున్నాయని మానసిక నిపుణులు చెబుతున్నారు. పలు సర్వేలు కూడా అదే పేర్కొంటున్నాయి. ఆ వివరాలేమిటో చూద్దామా!

మెట్రో నగరాల్లో 60%

నగరాల్లో జీవితం ఎంత బిజీగా, ఎంత ఆకర్షణీయంగా కనిపించినా, యువతలో ఒక రకమైన ఖాళీ భావన పెరుగుతోంది. ఇదే లోన్లీనెస్. చుట్టూ లక్షల మంది ఉన్నా, సోషల్ మీడియాలో వందలాది ఫ్రెండ్స్ ఉన్నా “నాకు ఎవరూ లేరు” అని ఫీల్ అవుతున్న యువతీ యువకుల సంఖ్య పెరుగుతోంది. ఇటీవలి సర్వేల ప్రకారం భారతీయ నగర యువతలో 43% మంది లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. ముంబై, ఢిల్లీ, బెంగళూరు వంటి మెట్రో నగరాల్లో ఇది 60% వరకు ఉంది. ఇది కేవలం ఒంటరిగా ఉండటం వల్ల మాత్రమే కాదు. భావోద్వేగ సపోర్ట్ లేకపోవడం, నిజమైన సంబంధాలు తగ్గడం వల్ల వచ్చే మానసిక ఖాళీగా నిపుణులు పేర్కొంటున్నారు.

కారణాలు

నగర జీవితంలో బిజీ వర్క్ లైఫ్, జాబ్ ప్రెజర్స్, సోషల్ మీడియా, నగరాల్లోని ‘న్యూక్లియర్ ఫ్యామిలీలు’. ఉదయం నుంచి రాత్రి వరకు ఆఫీసు లేదా స్టడీ, స్క్రీన్ టైమ్ ఎక్కువ కావడం వల్ల ఫేస్-టు-ఫేస్ మాట్లాడుకోవడాలు తగ్గిపోతున్నాయి. చాలా మంది యువత (ముఖ్యంగా 18-35 ఏళ్ల వారు) తమ భావాలు, సమస్యలు ఎవరితోనూ షేర్ చేసుకోలేకపోతున్నారని, దీని ఫలితంగా 57% యువత ఎమోషనల్ సపోర్ట్ కోసం ChatGPT వంటి AI టూల్స్‌ని ఆశ్రయిస్తున్నారని 2025 లో నిర్వహించిన ‘Youth Pulse Survey’ వెల్లడించింది. కొందరు రాత్రి పూట

ఏం చేయాలి?

లోన్లీనెస్ కేవలం మానసిక ఒత్తిడి మాత్రమే కాదు. దీర్ఘకాలంలో డిప్రెషన్, యాంగ్జైటీ, హార్ట్ ఇష్యూస్ వంటి ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుందని సర్వేలను విశ్లేషించిన నిపుణులు చెబుతున్నారు. అయితే ముందుగానే ఇలాంటి పరిస్థితులను నివారించే మార్గముంది. ఏంటంటే.. నిజమైన సంబంధాలను పెంచుకోవడం, హాబీ గ్రూప్స్, బుక్ క్లబ్స్, స్పోర్ట్స్ లేదా కమ్యూనిటీ ఈవెంట్స్‌లో పాల్గొనడం, ఫ్యామిలీ & ఫ్రెండ్స్‌తో వీక్లీ ఫేస్-టు-ఫేస్ మీటప్స్ పెంచడం వంటివి సహాయపడతాయి. అలాగే వీలైనంత వరకు స్క్రీన్ టైమ్‌ని తగ్గించి, ఏఐ మోడల్స్‌తో కాకుండా.. నిజమైన మనుషులతో కనెక్ట్ అవ్వడం ఈ “లోన్లీనెస్ ఎపిడెమిక్” నుంచి బయటపడేస్తుందని నిపుణులు సూచిస్తు్న్నారు. ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే మానసిక ఆరోగ్య నిపుణులను సంప్రదించవచ్చునని చెబుతున్నారు.

Read Also.. రిస్క్ వద్దు బాస్.. కంఫర్ట్‌జోనే బెటర్..! అమ్మాయిల్లో పెరుగుతున్న కొత్త ధోరణి

Next Story