పొలాల్లోకి వెళ్లి మరీ ఆ పని చేసిన పెళ్లి కొడుకు.. అతిథులంతా షాక్!

by Dishafeatures1 |
పొలాల్లోకి వెళ్లి మరీ ఆ పని చేసిన పెళ్లి కొడుకు.. అతిథులంతా షాక్!
X

దిశ,ఫీచర్స్: ఈ మధ్య కాలంలో పెళ్లిళ్లకు సంబంధించిన వీడియోలు ఎక్కువగా వైరల్ అవుతున్నాయి. పెళ్లి పందిరి లో ఏ చిన్న ఈవెంట్ జరిగిన అది నెట్టింట చక్కర్లు కొడుతూనే ఉంటోంది. అయితే.. కొన్ని వీడియోలు నవ్వులు పూయిస్తుంటే.. కొన్ని వీడియోలు మాత్రం నెట్టింట ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.. ప్రస్తుతం ఇలాంటి వీడియోనే నెట్టింట వైరల్ అవుతోంది.

ఓ పెళ్లి కొడుకు పెళ్లి సమయం దగ్గర పడుతున్న సమయంలో పొలాల్లోకి వెళ్లి.. చివరకు అతడు ఇచ్చిన ఎంట్రీ చూసి అంతా షాక్ అవుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు సాంప్రదాయ దుస్తుల్లో పెళ్లికి సిద్ధమయ్యారు. అయితే వరుడు మాత్రం పెళ్లి మంటపం లోకి వినూత్నంగా ఎంట్రీ ఇవ్వాలని అనుకున్నాడో ఏమో. రైతు కావడంతో స్వతహాగా పెళ్లి మంటపం లోకి ఎద్దుల బండి పై వెళ్లాలని నిర్ణయించుకున్నాడు.

పెళ్లి దుస్తులు ధరించిన వరుడు.. నేరుగా తమ పొలాల్లోకి వెళ్లి అక్కడి ఎద్దులను అందంగా అలంకరించి, చిన్న చిన్న చక్రాలతో తయారు చేసిన ఎడ్ల బండి పై కళ్యాణ మంటపం లో ఎంట్రీ ఇచ్చాడు. అది చూసి బంధువులంతా అవాక్కయ్యారు. రైతు కొడుకు అనిపించుకున్నవంటూ... చాలా మంది అతన్ని ప్రశంసించారు. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు ''ఎంట్రీ అదిరింది''.. అంటూ కొందరు, ''రైతు బిడ్డ" అనిపించుకున్నావ్ అని ఇంకొందరు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు.

Next Story

Most Viewed