- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రపంచంలోని అత్యంత ప్రమాదకరమైన విమానాశ్రయం.. ప్రతిసారి పైలెట్లు ఊపిరి బిగపట్టాల్సిందే!
సాధారణంగా విమానాశ్రయాలు విశాలమైన రన్‌వేలు, ఆధునిక సదుపాయాలు, అత్యుత్తమ నిబంధనలు ఉంటాయని తెలుసు.

దిశ, వెబ్ డెస్క్: సాధారణంగా విమానాశ్రయాలు విశాలమైన రన్‌వేలు, ఆధునిక సదుపాయాలు, అత్యుత్తమ నిబంధనలు ఉంటాయని తెలుసు. ప్రయాణికుల సురక్షిత ప్రయాణం కోసం అనేక భద్రతాపరమైన చర్యలు తీసుకుంటారు. అయితే అన్ని విమానాశ్రయాలు అంత సురక్షితమైనవి ఏమీ కావు. ప్రపంచంలో కొన్ని విమానాశ్రయాలు ప్రతి టేకాఫ్, ల్యాండింగ్ భయాన్ని కలిగించేలా ఉంటాయి. ఇలా ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ఎయిర్ పోర్టుల్లో ఒకటి.. నేపాల్ (Nepal)లోని లుక్లా విమానాశ్రయం (Lukla Airport).
నేపాల్‌లోని మౌంట్ ఎవరెస్టు సమీపంలో ఖుంబు అనే అందమైన ప్రాంతం ఉంది. ఇక్కడే లుక్లా విమానాశ్రయం ఉంది. దీనిని టెన్జింగ్–హిల్లరీ విమానాశ్రయం అని కూడా పిలుస్తారు. సముద్ర మట్టానికి దాదాపు 2,860 మీటర్ల (9,383 అడుగులు) ఎత్తులో ఉన్న ఈ ఎయిర్‌పోర్టు చుట్టూ ఎత్తైన పర్వతాలు, లోయలు ఉన్నాయి. రన్‌వే కేవలం 527 మీటర్ల (1,729 అడుగులు) పొడవు మాత్రమే ఉంటుంది. అందుకే ఇక్కడ ల్యాండింగ్, టేకాఫ్ అనేవి పైలెట్లకు ప్రతిసారి పెద్ద సాహసమనే చెప్పుకోవాలి.
అంతేకాదు ఇక్కడ వాతావరణం కూడా మినిట్‌కి మినిట్ మారిపోతుంది. దట్టమైన పొగమంచు, బలమైన గాలులు విమానాల రాకపోకలను మరింత ప్రమాదకరంగా మారుస్తాయి. ఆధునిక ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలు లేకపోవడం కూడా ఈ ప్రమాదకరమైన పరిస్థితులకు కారణంగా చెప్పవచ్చు. సాహసికులు, పర్వతారోహకులకు లుక్లా విమానాశ్రయం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకోవడానికి ఇదే ప్రధాన మార్గం. చిన్న విమానాలు, హెలికాప్టర్లు మాత్రమే ఇక్కడ ల్యాండ్ కాగలవు.
Read More..
సౌదీ అరేబియా రాజధానిని ముంచెత్తిన ఇసుక తుఫాను.. భయానక విజువల్స్ వైరల్






