- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
17 ఏళ్ల హృదంక్ ''ఏరోవైవ్''తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు
వెర్షన్ 3లో బ్యాలెన్స్‌డ్ ఎయిర్‌ఫ్లో.. మాడ్యులర్ డిజైన్‌తో సక్సెస్ అయ్యాడు

దిశ, ఫీచర్స్: గాలి కాలుష్యం మానవ జీవితాలను అతలాకుతలం చేస్తుంది. ఆరోగ్యాలను పాడుచేస్తుంది. అలాంటి కాలుష్య రక్కసిని మట్టుబెట్టాడు ముంబైకి చెందిన 17 ఏళ్ల హృదంక్ గరోడియా. తన ఆల్గే ఆధారిత ఎయిర్ ప్యూరిఫైయర్ ''ఏరోవైవ్''తో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు.
మెదడుపై ప్రభావం..
హృదంక్ గరోడియా ఆవిష్కరించిన ''ఏరోవైవ్'' డివైస్ సాధారణ మొక్కల కంటే 10 రెట్లు వేగంగా కార్బన్ డైఆక్సయిడ్‌ను గ్రహిస్తుంది. ఒకే యూనిట్‌లో 40 మొక్కల పనిని చేస్తుంది. ఇండోర్ గాలి నాణ్యతను మెరుగుపరచడంలో ఇది ప్రాక్టికల్ సొల్యూషన్‌గా నిలుస్తుంది. హృదంక్ స్కూల్లో చదివేటప్పుడు తీవ్ర అలసట.. తలనొప్పి.. ఏకాగ్రత లోపం వంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. అతడొక్కడే కాదు.. తోటి విద్యార్థులు.. టీచర్లను కూడా ఈ సమస్యలు వెంటాడాయి. గదిలో CO₂ స్థాయిలు 1500 ppmకు చేరాయి. ఇది మెదడు పనితీరును ప్రభావితం చేసే స్థాయి.
మూడోసారి సక్సెస్..
కలుషితమైన ఈ గాలి తీవ్రతను శుద్ధి చేయడానికి ఉపయోగించే సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్లు కణాలను మాత్రమే తొలగిస్తాయి. CO₂పై దృష్టి పెట్టవు. ఈ విషయాన్ని గుర్తించాడు హృదంక్. అలా మొదలైందే ''ఏరోవైవ్'' ఆలోచన. ఈ ఐడియాతో మైక్రోఆల్గే శాస్త్రాన్ని ఉపయోగించి జీవసంబంధ సిస్టమ్‌ను రూపొందించాడు. మైక్రోఆల్గే CO₂ను గ్రహిస్తుంది. కానీ సురక్షితంగా పనిచేయడమే పెద్ద సవాలు. మూడు వెర్షన్లు తయారుచేశాడు. వరుస రెండు వెర్షన్లు కఠిన పాఠం నేర్పాయి. ఎక్కువ పవర్ ఎప్పుడూ మంచిది కాదని గ్రహించాడు. వెర్షన్ 3లో బ్యాలెన్స్‌డ్ ఎయిర్‌ఫ్లో.. మాడ్యులర్ డిజైన్‌తో సక్సెస్ అయ్యాడు.
అందరికీ అందుబాట్లోకి..
ఐఐటీ బాంబే.. హార్వర్డ్ నిపుణుల మెంటార్‌షిప్ హృదంక్ ఆలోచనలను మార్చింది. ప్రొడక్ట్ యూజర్‌కు సహజంగా అర్థమయ్యేలా ఉండాలనే విషయం బోధపడింది. దీంతో మెయింటెనెన్స్‌ను సులభతరం చేశాడు. బయో-మెకానికల్ హైబ్రిడ్ డివైస్ కావడంతో ఫ్యాక్టరీలు ఆసక్తి చూపలేదు. CO₂ స్థాయిలు చూపిస్తే అందరూ అర్థం చేసుకుంటారు. ''ది ఇన్విజిబుల్ హీరోస్ ల్యాబ్'' ద్వారా 1000 మంది విద్యార్థులకు ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ నేర్పుతున్నాడు. ఏరోవైవ్ ప్రామాణికం అయితే అవి మార్కెట్లో సాధారణం అవుతాయి. అందరికీ అందుబాట్లోకి వస్తాయి.
Read More..






