కాంతి మారినా కళ్లు సేఫ్..! ఎలక్ట్రోక్రోమిక్ సన్‌గ్లాసెస్‌ను డెవలప్ చేసిన నిపుణులు

by Javid Pasha |   (  Updated:2026-01-08 07:03:52  IST  )

అన్ని వాతావరణాలు, కాంతి పరిస్థితులకు అనుగుణంగా కేవలం ఒక సెకండ్‌లోనే లెన్స్ రంగును మార్చుకునే అధునాతన ఎలక్ట్రోక్రోమిక్ సన్‌గ్లాసెస్‌ను సాంకేతిక నిపుణులు డెవలప్ చేశారు

కాంతి మారినా కళ్లు సేఫ్..! ఎలక్ట్రోక్రోమిక్ సన్‌గ్లాసెస్‌ను డెవలప్ చేసిన నిపుణులు
X

దిశ, ఫీచర్స్ : ఎండలో బయటకు వెళ్లేటప్పుడు, ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో పనిచేసేటప్పుడు, మౌంటైన్ బైకింగ్, రన్నింగ్, హైకింగ్, బోటింగ్ వంటి అవుట్‌డోర్ స్పోర్ట్స్‌లో పాల్గొన్నప్పుడు కళ్లకు రక్షణ కోసం చాలా మంది సన్‌గ్లాసెస్ లేదా సేఫ్టీ గ్లాసెస్ వాడుతుంటారు. ఇవి అధిక వెలుతురు నుంచి, అధిక వేడి నుంచి కాపాడుతాయి. అయితే రీసెంట్‌గా పోవెక్ ఆప్టిక్స్ (Povec Optics) అనే ఒక స్టార్టప్‌కు చెందిన సాంకేతిక నిపుణులు అధునాతన ఐవేర్ టెక్నాలజీతో ప్రపంచంలోనే మొట్ట మొదటిసారిగా అత్యంత సురక్షితమైన ఎలక్ట్రోక్రోమిక్ అనే సన్‌గ్లాసెస్‌ను డెవలప్ చేశారు. ఇవి అతినీల లోహిత కిరణాలనుంచి కళ్లను రక్షించడంలో అద్భుతంగా పనిచేస్తాయి. అలాగే అన్ని పరిస్థితుల్లోనే కాంతిని లేదా వెలుతురును కళ్లకు అనుకూలమైన స్థితిలో అడ్జస్ట్మెంట్ చేసుకునే వెసులు బాటు వీటిలో ఉంటుంది.

వాతావరణానికి అనుగుణంగా..

ఎలక్ట్రోక్రోమిక్ సన్‌గ్లాసెస్(Povec C1) మోడల్‌ అన్ని వాతావరణాలు, కాంతి పరిస్థితులకు అనుగుణంగా కేవలం ఒక సెకండ్‌లోనే లెన్స్ రంగును మార్చుకునే అధునాతన సాంకేతికతను కలిగి ఉంది. ఇందులోని టెంపుల్ భాగంలో టచ్ సెన్సిటివ్ స్ట్రిప్ కూడా ఉంటుంది. దీని ద్వారా వినియోగదారుడు తన వేలితో స్వైప్ చేసి లైట్ టింట్ నుండి డార్క్ టింట్ వరకు సర్దుబాటు చేసుకోవచ్చు. ఎందుకంటే ఆటోమోటివ్ టెక్నాలజీ నుండి మినియేచరైజ్ చేసిన ఈ ఎలక్ట్రోక్రోమిక్ లెన్సులు మల్టీలేయర్ కండక్టివ్ మెటీరియల్‌తో తయారవుతాయి. పైగా ఇవి లో వోల్టేజ్ ఎలక్ట్రిక్ చార్జ్ ద్వారా పనిచేస్తాయి. అలాగే యూవీ(UV400) కిరణాల నుంచి రక్షణ కల్పించే సాంకేతికతతోపాటు యాంటీ-గ్లేర్ కోటింగ్ వంటి ఫీచర్లతో దీర్ఘకాలిక కంటి ఆరోగ్యాన్ని కాపాడటంలో కీ రోల్ పోషిస్తాయని నిపుణులు అంటున్నారు. ప్రత్యేక వాతావరణ పరిస్థితుల్లో అంటే పగలు మేఘావృతమైనప్పుడు లేత రంగు, ఎండ తీవ్రంగా ఉన్నప్పుడు ముదురు రంగు ఇలా కాంతి పరిస్థితులకు తగ్గట్టు సర్దుబాటు చేసుకోవచ్చు.

ప్రయోజనాలు

పోవెక్ సి1 సన్‌గ్లాసెస్ మౌంటైన్ బైకింగ్, రన్నింగ్, హైకింగ్, బోటింగ్ వంటి అవుట్‌డోర్ స్పోర్ట్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడ్డాయి, ఎందుకంటే ఇవి డాప్ల్డ్ లైట్(Strobe effect from screws) వంటి సమస్యలను తక్షణంగా పరిష్కరిస్తాయి. బ్యాటరీ లైఫ్ రోజుకు 4 గంటల వినియోగంతో 28 రోజుల వరకు ఉంటుంది. USB-C ద్వారా ఛార్జ్ అవుతుంది. స్మార్ట్ పవర్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ ద్వారా ఆటోమేటిక్‌గా ఆన్/ఆఫ్ అవుతుంది. మూడు ఇంటర్‌ఛేంజబుల్ నోజ్ ప్యాడ్‌లతో కస్టమైజ్డ్ ఫిట్ అందిస్తుంది. స్వేట్ అండ్ స్ప్లాషెస్‌(Splashes)ను తట్టుకుంటుంది. కాబట్టి ఇవి వేగంగా మారుతున్న వాతావరణ పరిస్థితుల్లో వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన అనుభవాన్ని అందిస్తాయంటున్నారు నిపుణులు. అయితే ప్రస్తుతం విస్తృతంగా ఉపయోగించేందుకు మాత్రం మార్కెట్‌లో అందుబాటులో లేవు. 2026 మేలో అందుబాటులోకి వచ్చే చాన్స్ ఉందని సాంకేతిక నిపుణులు అంటున్నారు. Link

Read More..

సైబర్ సిక్‌నెస్ : ఇటీవల పెరుగుతున్న కొత్త అనారోగ్యం! ఎందుకు, ఎలా వస్తుంది?

Next Story