- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సైబర్ సిక్‌నెస్ : ఇటీవల పెరుగుతున్న కొత్త అనారోగ్యం! ఎందుకు, ఎలా వస్తుంది?
వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక్కసారిగా తలతిరగడం, వికారం, వాంతింగ్స్ వంటి సమస్యలు తలెత్తుతున్నాయా? సైబర్ సిక్‌నెస్ లక్షణాలు కావచ్చు!

దిశ, ఫీచర్స్ : సోషల్ మీడియాలో నిమగ్నమైనప్పుడో, వీడియోలు స్క్రోల్ చేస్తున్నప్పుడో ఒక్కసారిగా తలతిరగడం, వికారం, తలనొప్పి వంటి సమస్యలు మీలో తలెత్తుతున్నాయా? అయితే అది సైబర్ సిక్‌నెస్ వల్ల కావచ్చు! అంటున్నారు నిపుణులు. డిజిటల్ పరికరాలను అతిగా ఉపయోగించడంవల్ల వచ్చే మోషన్ సిక్‌నెస్ రకాల్లో ఇదొకటి. మొబైల్, కంప్యూటర్, వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ వంటివి ఉపయోగిస్తున్నప్పుడు, హెడ్‌సెట్ ధరించి వర్చువల్ ప్రపంచంలో మోషన్ (కదలిక) అనుభవిస్తున్నప్పుడు తలెత్తుతుంది. ఎందుకంటే కళ్లు వర్చువల్‌లో రన్నింగ్, ఫ్లయింగ్ వంటి కదులుతున్న దృశ్యాలను చూస్తుంటాయి. కానీ శరీరం నిజంగా స్థిరంగా ఉంటుంది. ఈ పరిస్థితి మెదడుకు విజువల్ (కళ్లు) అండ్ వెస్టిబ్యులర్ (ఇన్నర్ ఇయర్ బ్యాలెన్స్) సిగ్నల్స్ మధ్య అసమతుల్యతకు, అసమంజసత్వానికి కారణం అవుతుంది. దీనినే న్సరీ కాన్‌ఫ్లిక్ట్ (Sensory Conflict Theory) అంటారు.
ఎలా బయపటడింది?
నిజానికి కొవిడ్ మహమ్మారి సమయంలో లాక్ డౌన్, భౌతిక దూరం వంటి కారణాలతో రిమోట్ వర్క్, ఆన్‌లైన్ సోషలైజేషన్ పెరిగింది. దీంతో సహజంగానే స్క్రీన్ టైమ్ కూడా పెరిగింది. ఈ పరిస్థితి సైబర్ సిక్‌నెస్‌ను కూడా మరింత ఎక్కువ చేసింది. మొదట వర్చువల్ రియాలిటీ (VR)లో గుర్తించబడిన ఈ సమస్య, కళ్లు చూసే విజువల్ మోషన్, శరీరం అనుభవించే స్థిరత్వం మధ్య అసమంజసత్వం(Unreasonableness) వల్ల వస్తుంది. ఈ సందర్భంగా నిపుణులు కనుగొన్నారు. దీనినే సెన్సరీ కాన్ఫ్లక్ట్ థియరీ(Sensory Conflict Theory)గా పేర్కొన్నారు. అయితే ఇది మరీ కొత్తదేమీ కాదు. పురాతన కాలంలో కూడా మరో రూపంలో మోషన్(కదలిక) సిక్‌నెస్ ఉండేది. ఉదాహరణకు సముద్ర అనారోగ్యం 800 BCE నాటిది, కానీ నేటి డిజిటల్ యుగంలో ఇది సోషల్ మీడియా స్క్రోలింగ్, గేమింగ్ వంటి కార్యకలాపాల్లో కనిపిస్తోంది.
ఇదీ కారణం!
ఇది నిజమైన కదలిక లేదా స్థానచలనం లేని పరిస్థితుల్లో, కళ్లు మాత్రమే వర్చువల్‌గా కదలికలను చూస్తూ ఉన్నప్పుడు మెదడు గందరగోళానికి గురవుతుంది. దీంతో తలనొప్పి, తల తిరగడం, వికారం వంటివి తలెత్తుతాయి. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్లలో నిమగ్నమై పోవడం, సోషల్ మీడియాలో గంటల తరబడి గడపడం ఇందుకు కారణం అవుతున్నదని నిపుణులు చెబుతున్నారు. లాంగ్ స్క్రీన్ టైమ్, ఫాస్ట్ మూవింగ్ కంటెంట్, అలాగే మోషన్ సిక్‌నెస్ హిస్టరీ ఉన్నవారిలో ఈ సమస్య మరింత అధికం అవుతుంది.
లక్షణాలు
తలనొప్పి, తల తిరగడం, కళ్లు తిరగడం, కళ్లపై ఒత్తిడి లేదా అలసట, శరీరంపై చెమటలు పట్టడం, వికారం, కొన్నిసార్లు వాంతింగ్స్ అవడం వంటివి సైబర్ సిక్‌నెస్ లేదా మోషన్ సిక్‌నెస్ లక్షణాలుగా పేర్కొనవచ్చు. ఇవి స్క్రీన్ చూడటం ఆపేసిన తర్వాత కూడా కొన్ని గంటలు లేదా రోజులు కొనసాగవచ్చు.
నివారణ లేదా చికిత్స
సాధారణంగా స్క్రీన్‌టైమ్ తగ్గించడం లేదా లక్షణాలు తగ్గే వరకు డిజిటల్ పరికరాలు, స్క్రీన్‌లకు దూరంగా ఉండటంవంటి నివారణ చర్యలతో సమస్యకు పరిష్కారం లభిస్తుంది. సైబర్‌సిక్‌నెస్‌కు ప్రత్యేక చికిత్స అంటూ ఏదీ లేదు. ఆన్‌లైన్‌లో లేదా సోషల్ మీడియాలో తరచుగా నిమగ్నమయ్యేవారు ప్రతీ 20 లేదా 30 నిమిషాలకు బ్రేక్ తీసుకోవాలి. లేదా 20-20-20 రూల్ ఫాలో కావాలి. అంటే ప్రతీ 20 నిమిషాలకు ఒకసారి 20 సెకన్లు బ్రేక్ తీసుకొని, 20 అడుగుల దూరంలో పరిసరాలను చూడాలి. ముఖ్యంగా స్క్రీన్ టైమ్ తగ్గించంచడం, సరైన దూరం పాటించడం, స్క్రీన్ సెట్టింగ్స్‌లో బ్రైట్‌నెస్, కాంట్రాస్ట్ తగ్గించడం, మోషన్ స్మూత్‌నెస్ పెంచడం వంటివి నివారణలో భాగమని చెప్పవచ్చు. అలాగే నీళ్లు ఎక్కువగా తాగడంవల్ల బాడీ హైడ్రేటెడ్‌గా ఉండి సిక్‌నెస్ లక్షణాల ప్రభావాన్ని తగ్గిస్తుంది.






