- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్రీన్ టీ తాగే వారిలో పెరుగుతున్న ఆ సామర్థ్యం.. ఇంకా ఏం జరుగుతుందంటే..!
శరీర అభివృద్ధి, జననేంద్రియ ఆరోగ్యంతోపాటు మొత్తం మానవ జీవక్రియలోనూ టెస్టోస్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. గ్రీన్ టీ తాగడంవల్ల ఇది మరింత మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు.

దిశ,ఫీచర్స్ : గ్రీన్ టీ జీర్ణక్రియ ఆరోగ్యానికి మంచిదనే విషయం తెలిసిందే. కానీ ఇది నిద్రలేమిని దూరం చేస్తుందని, శరీరంలో ఇన్‌ఫ్లమేషన్(మంట)ను, వాపును తగ్గిస్తుందని, పురుషుల్లో టెస్టో స్టెరాన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా లైంగిక సామర్థ్యాన్ని మెరుగు పరుస్తుందని ఒక అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఈ పానీయం సహజ ఆరోగ్యాన్ని పెంపొందించే శక్తివంతమైన డ్రింక్ అంటున్నారు నిపుణులు.
30% పెరుగుతున్న సామర్థ్యం
చైనా మెడికల్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు 280 మంది పురుషులపై నిర్వహించిన అధ్యయన ఫలితాల ప్రకారం.. రోజుకు ఒక కప్పు గ్రీన్ టీ తాగేవారు కొన్ని రకాల అనారోగ్యాలకు, మానసిక రుగ్మతలకు దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా 20 ఏండ్లకు పైగా గ్రీన్ టీ తాగుతున్నవారిలో, 45 ఏండ్లు పైబడిన పురుషుల్లో గ్రీన్ టీ తాగడంవల్ల టెస్టో స్టెరాన్ స్థాయిలు 30% పెరిగినట్లు అధ్యయనం కనుగొన్నది. టెస్టోస్టెరాన్ మానవ శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక ముఖ్యమైన సెక్స్ హార్మోన్. ప్రధానంగా ఇది పురుషులలో టెస్టిస్ (వృషణాలు)లో ఉత్పత్తి అవుతుంది. అయితే స్త్రీలలో కూడా అండాశయాలు, అలాగే అడ్రీనల్ గ్రంథులలో స్వల్ప మొత్తంలో ఉత్పత్తి అవుతుంది. ఇది స్టెరాయిడ్ హార్మోన్ గ్రూప్‌నకు చెందినది.
శరీర అభివృద్ధికి కూడా..
శరీర అభివృద్ధి, జననేంద్రియ ఆరోగ్యంతోపాటు మొత్తం మానవ జీవక్రియలోనూ టెస్టో స్టెరాన్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇలాంటి ఒక ముఖ్యమైన హార్మోన్ గ్రీన్ టీ తాగడంవల్ల మరింత మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా డైలీ వన్ కప్ గ్రీన్ టీ తాగడంవల్ల ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుందని, నాణ్యమైన నిద్రను మెరుగు పరుస్తుందని, ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటివి కూడా తగ్గుతాయని అధ్యయనం స్పష్టం చేసింది. ఇక స్త్రీల విషయానికి హర్మోనల్ బ్యాలెన్స్‌ను మెరుగు పర్చడంలో గ్రీన్ టీ తాగడం సహాయపడుతుందని తెలిపింది. Link
Read More..






