- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రోగికి అనస్థీషియా ఎప్పుడు ఇస్తారు? ఎన్ని రకాలు?
ఏదైనా శస్త్రచికిత్సకు ముందు రోగికి అనస్థీషియా ఇస్తారని మీకు తెలుసా? సర్జరీ చేసే ప్రాంతంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. దీంతో ఈ ప్రాంతం తిమ్మిరిగా మారుతుంది. దీంతో రోగి నొప్పి, ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించకుండా చేస్తుంది.

దిశ, వెబ్ డెస్క్ : ఏదైనా శస్త్రచికిత్సకు ముందు రోగికి అనస్థీషియా ఇస్తారని మీకు తెలుసా? సర్జరీ చేసే ప్రాంతంలో నొప్పి తెలియకుండా ఉండేందుకు ఇలా చేస్తారు. దీంతో ఈ ప్రాంతం తిమ్మిరిగా మారుతుంది. దీంతో రోగి నొప్పి, ఒత్తిడి, అసౌకర్యాన్ని అనుభవించకుండా చేస్తుంది. అయితే అనస్థీషియా అనేది పెద్దలకు మాత్రమే. చిన్న ఆపరేషన్ల సమయంలోనే కాకుండా నొప్పి నివారణ విధానాల్లోనూ ఉపయోగించబడుతుంది.
అయితే అనస్థీషియా ఇచ్చేందుకు ప్రత్యేకంగా అనస్థీషియాలజిస్టులు ఉంటారు. ప్రతి సక్సెస్‌ఫుల్ సర్జరీ వెనుక కీలకపాత్ర పోషిస్తారు. పేషెంట్లలో కాన్ఫిడెన్స్, క్లారిటీ తీసుకురావడంలో ముందుంటారు. కాగా అనస్థీషియాలో మూడు రకాలు ఉంటాయి. ఒకటి లోకల్ అనస్థీషియా.. ఇది శరీరంలోని చిన్న భాగం తిమ్మిరి అయ్యేలా చేస్తుంది. దంతాలు వెలికితీయడం, కుట్లు వేయడం సమయంలో ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇక రెండోది రీజినల్ అనస్థీషియా. ఇందులో.. శరీరంలోని పెద్ద భాగాలు అంటే చేతులు, కాళ్లు, నడుము వంటి ప్రాంతాలు తిమ్మిరెక్కుతుంటాయి. మూడోది జనరల్ అనస్థీషియా. ఇది రోగిని పూర్తిగా నిద్రపోయేలా చేస్తుంది. రోగికి ఎటువంటి నొప్పి, కదలికలు లేకుండా చేస్తుంది.
Read More..
గ్రీన్ టీ తాగే వారిలో పెరుగుతున్న ఆ సామర్థ్యం.. ఇంకా ఏం జరుగుతుందంటే..!






