- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామాలే కాదు..! సామాజిక సంబంధాలూ ముఖ్యమే
సామాజిక సంబంధాలు రోజువారీ జీవితంలో ఎమోషనల్ సపోర్ట్ అందించడంలో, భావోద్వేగ మద్దతును పొందడంలో సహాయపడతాయి. తద్వారా సానుకూల మార్పులకు దారితీస్తాయి.

దిశ, ఫీచర్స్ : మీరు ఆరోగ్యంగా, ఆనందంగా, ఉండాలంటే కేవలం వ్యాయామాలు చేస్తేనే సరిపోదు! బలమైన సామాజిక సంబంధాలు కూడా చాలా ముఖ్యం అంటున్నారు మానసిక నిపుణులు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ నిపుణుల ఇటీవల అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. స్ట్రాంగ్ అండ్ క్వాలిటీ రిలేషన్స్ మానవ సంబంధాలు లోన్లీనెస్‌ను తగ్గించి, మానసిక స్థైర్యాన్ని, గుండె ధైర్యాన్ని పెంచుతాయని, భావోద్వేగ నియంత్రణలోనూ కీ రోల్ పోషిస్తాయని పేర్కొన్నది.
అంతేకాకుండా మానవుల మధ్య ప్రేమ, ఆప్యాయతతో కూడిన సామాజిక సంబంధాలు రోజువారీ జీవితంలో ఎమోషనల్ సపోర్ట్ అందించడం ద్వారా సానుకూల మార్పులకు దారితీస్తాయి. స్లీప్ క్వాలిటీ(Sleep quality), స్ట్రెస్ లెవెల్స్, దీర్ఘకాలిక వ్యాధులు, జీవితకాలంపై కూడా పాటిటివ్ ఇంపాక్ట్ చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే సోషల్ కనెక్షన్స్ చురుకుగా ఉండే వ్యక్తుల్లో (Among socially active people) గుండె జబ్బులు, మానసి కుంగుబాటు (Depression) వంటి ఆరోగ్య సమస్యలు తక్కువగా కనిపిస్తాయని, వీరిలో వ్యాధుల నుండి త్వరగా కోలుకునే సామర్థ్యం కూడా పెరుగుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అంతేకాకుండా సోషల్ కనెక్షన్ష్ ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచడం ద్వారా మానసిక స్థిరత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.






