- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వ్యాయామాలే సరిపోవు.. ఆరోగ్యంగా ఉండటానికి బలమైన సబంధాలూ ముఖ్యమేనంటున్న నిపుణులు..!
సామాజిక సంబంధాలు వంటివి వ్యక్తుల స్లీప్ క్వాలిటీ(Sleep quality), స్ట్రెస్ లెవెల్స్, దీర్ఘకాలిక వ్యాధులు, జీవితకాలంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు.

దిశ, ఫీచర్స్ : మనం ఆరోగ్యంగా, ఆనందంగా, ఉండాలంటే రోజూ వ్యాయామాలు, సరైన పోషకాహారాలే కాదండోయ్.. మానవ, సామాజిక సంబంధాలు కూడా చాలా ముఖ్యం అంటున్నారు నిపుణులు. ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్, ఇండ్లల్లో ఎంతో ముచ్చటగా పెంచుకునే పెంపుడు జంతువులు కూడా ఇందులో భాగంగా ఉంటాయని పేర్కొంటున్నారు. యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ వెటరన్స్ అఫైర్స్ నిపుణుల ఇటీవల అధ్యయనం కూడా ఇదే చెబుతోంది. క్వాలిటీ రిలేషన్స్, అంటే బలమైన, నాణ్యమైన మానవ సంబంధాలు లోన్లీనెస్‌ను తగ్గించి, మానసిక స్థైర్యాన్ని, గుండె ధైర్యాన్ని పెంచుతాయి. భావోద్వేగ నియంత్రణలోనూ కీ రోల్ పోషిస్తాయి.
వ్యక్తుల మధ్య ప్రేమ, ఆప్యాయతతో కూడిన ఆరోగ్యకరమైన వ్యక్తిగత సంబంధాలు, అలాగే సామాజిక సంబంధాలు వంటివి వ్యక్తుల స్లీప్ క్వాలిటీ(Sleep quality), స్ట్రెస్ లెవెల్స్, దీర్ఘకాలిక వ్యాధులు, జీవితకాలంపై కూడా ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సంబంధాల్లో చురుకుగా ఉండే వ్యక్తుల్లో (Among socially active people) గుండె జబ్బులు, మానసి కుంగుబాటు (Depression) వంటి ఆరోగ్య సమస్యలు తక్కువగా కనిపిస్తాయని, అలాగే వ్యాధుల నుండి త్వరగా కోలుకునే సామర్థ్యం అధికంగా ఉంటుందని కూడా అధ్యయనాలు సూచిస్తున్నాయి.సన్నిహిత సంబంధాలు, సామాజిక సంబంధాలు ఒత్తిడి హార్మోన్లను తగ్గించి, రోగ నిరోధక శక్తిని పెంచడంలోనూ సహాయపడతాయి. మొత్తానికి ఇవి వ్యక్తుల్లో మానసిక స్థిరత్వాన్ని, ఆత్మస్థైర్యాన్ని, గుండె ధైర్యాన్ని పెంచుతాయని, జీవితంలో సంతోషాన్ని, సానుకూల దృక్పథాన్ని పెంపొందిస్తాయని నిపుణులు చెబుతున్నారు.






