నీరు తాగకపోతే దెబ్బతింటున్న మెదడు.. 20% స్లో డౌన్ షాక్ !

by Javid Pasha |

మెదడుకు తగినంత నీరు అందకపోతే దాని పరిమాణం కుచించుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు.

నీరు తాగకపోతే దెబ్బతింటున్న మెదడు.. 20% స్లో డౌన్ షాక్ !
X

దిశ, ఫీచర్స్ : తగినంత నీరు తాగకపోతే శరీరం డీహైడ్రేషన్‌కు గురవుతుందన్న విషయం తెలిసిందే. కానీ మెదడు పనితీరు కూడా మందగిస్తుందన్న సంగతి మీకు తెలుసా? ‘‘Dehydration confounds the assessment of brain atrophy’’పేరుతో Neurology జర్నల్‌లో పబ్లిషైన అధ్యయన వివారలతో సహా పలు ఇతర అధ్యయనాలు సైతం ఇదే చెబుతున్నాయి. కేవలం శరీర అవసరానికి మాత్రమే కాదు, మన మెదడుకు కూడా తగినంత నీరు అవసరం అవుతుందని పేర్కొంటున్నాయి.

*మెదడుకు తగినంత నీరు అందకపోతే దాని పరిమాణం కుచించుకుపోయే ప్రమాదం ఉందని నిపుణులు అంటున్నారు. అంతేకాకుండా దాని పని తీరు కూడా 20% వరకు నెమ్మదిగా మారుతుంది. డీహైడ్రేషన్ లేదా నీటి కొరత వల్ల ఏకాగ్రత, జ్ఞాపకశక్తి తగ్గుతాయి. మొత్తం మానసిక స్థితి ప్రభావితం అవుతుంది. అందుకే రోజంతా నీటిని తరచుగా సిప్ చేస్తూ ఉండాలని, దీని వల్ల మెదడు సమర్థవంతంగా పనిచేస్తుందని, మీరు ఎల్లప్పుడూ హుషారుగా ఉత్సాహంగా ఉంటారని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

*శాస్త్రీయ పరిశోధనల ప్రకారం.. మన శరీరంలో 60-70% నీరు ఉంటుంది. అలాగే మెదడు 75% నీటితో నిండి ఉంటుంది. కాగా కేవలం 1-2% నీటి కొరత కూడా మెదడు కణాల పనితీరును దెబ్బతీస్తుంది. ఇది తలనొప్పి, అలసట, ఆలోచనా సామర్థ్యం తగ్గడానికి దారితీస్తుంది. అంతేకాకుండా అధ్యయనాల ప్రకారం.. డీహైడ్రేటెడ్ వ్యక్తులు సాధారణంగా ఆయా సమస్యలను 20% నెమ్మదిగా పరిష్కరిస్తారు. ఎందుకంటే నీటికొరత వల్ల షార్ట్-టర్మ్ మెమరీ బలహీనపడుతుంది. కాబట్టి, రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగడం అలవాటు చేసుకోవాలని, బాడీ సిచువేషన్ అండ్ ఆన్ డిమాండ్‌ను బట్టి నీరు తాగాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వ్యాయామం చేసేటప్పుడు, ఒత్తిడిలో ఉన్నప్పుడు, వేడి వాతావరణంలో ఉన్నప్పుడు ఎక్కువ నీరు అవసరం. నీటిని సిప్ చేస్తూ ఉండటం మీ మెదడును రక్షిస్తుంది. అలాగే మొత్తం ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. Link

Next Story